TRS Protest: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పిండ ప్రదానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పీసీసీ రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ స్టేట్ సోషల్ మీడియా నేతృత్వంలో టీఆర్ఎస్ ఐటీ సెల్ ఆధ్వర్యంలో పిండ ప్రదానం చేశారు. రేవంత్ రెడ్డి చిత్రపటంతో వెళ్లి ఆయన పిండాలను మూసీ నదిలో కలిపి వారి నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ వై. సతీష్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ వ్యతిరేకి, చంద్రబాబు పెంపుడు కుక్క, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అని అన్నారు. ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేదలకు సేవా కార్యక్రమాలు చేయమని, భావితరాలకు భరోసానిచ్చే మొక్కలు నాటే కార్యక్రమాలకు పిలుపునిచ్చారు.
కానీ ఈ రేవంత్ రెడ్డి అనే చంద్రబాబు పెంపుడు కుక్క దాన్ని కూడా రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు. మా అధినేతకు పన్నెండొద్దులు చేయమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డికి ఇవ్వాళ మేం పిండ ప్రదానం చేశామన్నారు. మీ పార్టీ అధ్యక్షుడి పుట్టికనే ప్రశ్నించిన బీజేపీని ఎదురించిన గొప్ప మనస్సు మా నాయకుడు కేసీఆర్ దన్నారు.
Also Read
అలాంటి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు చెప్పాల్సింది పోయి…ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం రేవంత్ రెడ్డి నీచబుద్ధికి నిదర్శమన్నారు. తొందర్లోనే నీకు, నీ పార్టీకి తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు సతీష్ రెడ్డి. ఇకనుంచైనా నీ బాస్ చంద్రబాబు బానిస సంకెళ్ల నుంచి బయటపడి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడాలని హితవు పలికారు సతీష్ రెడ్డి. రేవంత్ రెడ్డి చిత్రపటానికి పిండప్రదానం చేసే కార్యక్రమంలో టీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్తో పాటు రీచార్జ్పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!