నేడు ఉదయం 8 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. అనంతరం నేరుగా అసెంబ్లీకి వెళ్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓటు వేయనున్నారు. వరద ప్రాంతాల పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ నిన్న రాత్రి వరంగల్‌లోనే బస చేసారు. నేడు ఉదయం వరంగల్ నుంచి నేరుగా అసెంబ్లీకి చేరుకుని సీఎం కేసీఆర్ ఓటు వేయనున్నారు. సీఎం కేసీఆర్‌తో పాటే వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు కూడా ఓటింగ్‌లో పాల్గొననున్నారు. ఇక విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు తెలిపిన…
తెలంగాణ సీఎం కేసీఆర్ భద్రాచలం ముంపు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా.. సీఎం కేసీఆర్ మాట్లాడారు. బాధితులకు శాశ్వత కాలనీలు నిర్మిస్తామని, శాశ్వత కాలనీల కోసం అధికారులు ఎత్తయిన ప్రదేశాలను గుర్తించాలని పేర్కొన్నారు. ప్రజలకు ఎత్తైన ప్రదేశంలో రూ.1000 కోట్లతో కొత్త కాలనీ నిర్మిస్తామని సీఎం స్పష్టం చేశారు. వరద బాధితులకు తక్షణ సాయం కింద కుటుంబానికి రూ.10వేలు సాయం అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. 7,274 కుటుంబాలను జిల్లా యంత్రాంగం పునరావాస కేంద్రాలకు తరలించిందని కేసీఆర్…
CM KCR Sensational Comments: భద్రాచలం పర్యటనలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల వెనుక విదేశాల కుట్ర ఉందని ఆరోపించారు. దేశంలో క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్ధతి వచ్చిందని.. దీని వెనుక కుట్రలు ఉన్నాయని కేసీఆర్ అన్నారు. గతంలో లేహ్‌లో ఇలా చేశారని.. ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్ చేశారని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. ఇప్పుడు ఇక్కడ కూడా క్లౌడ్ బరస్ట్ చేస్తున్నారని.. దీనిపై అధికారులు అధ్యయనం చేస్తున్నారని కేసీఆర్…
* ఐపీఎల్ 2022: రసవత్తరంగా మారిన ఐపీఎల్ పోరు. ఫైనల్ లో తలపడనున్న రాజస్థాన్-గుజరాత్. ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న గుజరాత్ టైటాన్స్. రాత్రి 7.30 గంటలకు అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ * అనంతపురంలో సామాజిక న్యాయ భేరీ కార్యక్రమంలో భాగంగా వైసీపీ మంత్రుల బస్సు యాత్ర ముగింపు సభ. 1700 మంది పోలీసులతో భారీ బందోబస్తు. *నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర. నంద్యాల నుంచి బయల్దేరి కర్నూలు చేరుకోనున్న…
తెలంగాణలో కేసీఆర్ సర్కార్ పోవాలని జనం కోరుకుంటున్నారని, బీజేపీ సర్కార్ రావాలని ఎదురుచూస్తున్నారన్నారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్. బండి సంజయ్ అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశానికి బీజేపీ జాతీయ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ తో పాటు తరుణ్ చుగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ పదాధికారుల సమావేశంలో ఆయన కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ ముక్త్ తెలంగాణ బీజేపీ లక్ష్యం అన్నారు. టీఆర్ఎస్…
తెలంగాణ ప్రభుత్వం తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పరస్పరం బదిలీలకు అప్లై చేసుకున్న ఉద్యోగులు. తీవ్ర మానసిక ఆందోళనలో తమకు న్యాయం చేయాలని వారు సీఎం కేసీఆర్‌ని వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఆగమేఘాల మీద 317 జీవో ను తీసుకువచ్చి 2022 జనవరి 6న రాత్రికి రాత్రే మాది కాని జిల్లాలో మమ్ములను పంపించిందన్నారు. ఒక్క రోజు కూడా సమయం ఇవ్వలేదు. మా తల్లిదండ్రులకు భార్య పిల్లలకు దూరం చేసింది. సొంత జిల్లాలను కోల్పోయిన ఉద్యోగులు తీవ్ర ఆందోళన…
విజయవాడలో తెలంగాణ సీఎం కేసీఆర్ భారీ ఫ్లెక్సీని పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఏర్పాటు చేయడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్భంగా తెలంగాణలో టిక్కెట్ ధరలు పెంచడం, ఐదో షోకు అనుమతులు ఇవ్వడాన్ని స్వాగతిస్తూ పవన్ అభిమానులు కేసీఆర్ మీద తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో హ్యాట్సాఫ్ సీఎం అంటూ విజయవాడ కృష్ణలంకలోని ఫైర్ స్టేషన్ సమీపంలో భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. పవన్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం కేసీఆర్…
2023 కి ముందే దేశంలో మరో ఫ్రంట్ రాబోతోందా? తెలంగాణ దానికి వేదిక కాబోతోందా? అంటే అవుననే అనిపిస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసే పనిలో వున్నారు. వీరందరి సమావేశానికి ముహూర్తం ఖరారైందా ? అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాతే ప్రాంతీయ పార్టీల భేటీ జరిగే అవకాశం ఉందా ? ప్రాంతీయ పార్టీల సమావేశంకు హైదరాబాద్ నగరం వేదిక కాబోతోందా ? జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్…