Telangana Assembly: తెలంగాణ రాష్ట్రంలో మధ్యంతర బడ్జెట్ సమావేశాలు నిన్న (శనివారం)తో ముగిసింది. ఫిబ్రవరి 8వ తేదీన తమిళసై ప్రసంగంతో ప్రారంభమైన అసెంబ్లీ ఫిబ్రవరి 17 వరకు కొనసాగాయి.
తెలంగాణ అసెంబ్లీలో అధికార- ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. శాసనసభలో ఇవాళ నీటిపారుదల రంగంపై శ్వేతపత్రం ప్రవేశ పెట్టాగా.. దానిపై మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతుండగానే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కల్పించుకున్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాతనే నీటిరంగంపై చర్చ కొనసాగాలని తెలిపారు. పాపాల భైరవుడు కేసీఆర్ను సభకు పిలవాలి అని ఆయన కోరారు.
కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని కాదు అని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ కళంకంగా మారింది.. ప్రజలను నమ్మి పదేళ్లు అధికారం ఇస్తే తెలంగాణను నిండా ముంచారు.. కూలిన ప్రాజెక్టును చూసి మీరు సిగ్గుపడాలి అంటూ ఆయన వ్యాఖ్యనించారు.
కాళేశ్వరం నిట్ట నిలువునా చిలిపోయింది అని పేర్కొన్నారు. మేడిగడ్డ కాదు అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టులు కూడా పోతది అని NDSA చెప్పింది అని తెలిపారు. జ్యోతిష్యం కాదు, నిపుణులు చెప్పిన మాట అని మల్లు భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తూ శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటెషన్ ఇచ్చింది. దీనిపై దీర్ఘకాలిక చర్చలో భాగంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.
కులగణన తీర్మానాన్ని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ కులగణన తీర్మానాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో ప్రవేశపెట్టారు. కులగణనతో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని మంత్రి పేర్కొన్నారు. కులగణనపై రాజకీయాలు చేయొద్దని ఆయన అసెంబ్లీలో తెలిపారు. కులగణనపై ఎవరికీ అనుమానం అవసరం లేదన్నారు.
CM Revanth Reddy: కుల గణన తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఈ తీర్మానానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. తీర్మానంపై బీఆర్ ఎస్ తరఫున మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడారు. కుల గణనను పటిష్టంగా నిర్వహించాలని ఈ సందర్భంగా గంగుల ప్రభుత్వానికి సూచించారు. అదేవిధంగా కుల గణనపై తీర్మానం చేయడమే కాకుండా చట్టం చేస్తే బాగుంటుందన్నారు. అనంతరం కేటీఆర్, కడియం కులగణన పై కన్ఫ్యూస్ చేస్తున్నట్లు మాట్లాడుతున్నారని భట్టి విక్రమార్క తెలిపారు. ఎలాంటి కన్ఫ్యూస్…