ఐదుగురు ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా భట్టి విక్రమార్క రోజూ సభకు వచ్చారని.. 38 మంది ఉన్న బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ ఎందుకు రావడం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి కంటే ఎక్కువ విలువ ప్రతిపక్ష నాయకుడికి ఉంటుందన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ ఖతం అవుతుంది అని కేసీఆర్ ముందే తెలుసుకొని సభకు రావడం లేదన్నారు.
తమ భూమి తమకే ఉండాలని కొట్లాడిన పాపానికి లగచర్ల రైతులను జైల్లో పెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. వారి మీద కేసులు పెట్టడమే కాకుండా వారిపై థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నారన్నారు. లగచర్ల ఘటనపై చర్చ పెడదాం అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు.
లగచర్ల రైతులకు బేడీల విషయంపై అసెంబ్లీ చర్చకు బీఆర్ఎస్ పట్టుబట్టింది. పర్యాటక శాఖపై కాకుండా లగచర్ల రైతులకు బేడీల విషయంపై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ శాసనసభ్యులు డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్లకార్డులు పట్టుకొని బీఆర్ఎస్ శాసన సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఇదేం రాజ్యం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.
పక్కాగా పోలీస్ ప్లానింగ్.. ఆల్ హ్యాపీస్! సెప్టెంబర్ 01 ఆదివారం నాడు ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 8 నిన్న ఆదివారంతో ముగిసింది. దాదాపు 105 రోజుల పాటు సాగిన బిగ్బాస్ సీజన్ 8లో విజేతగా కన్నడ నటుడు నిఖిల్ మలియక్కల్ బిగ్బాస్ సీజన్ 8 గెలిచి కప్ న అందుకున్నాడు. బిగ్బాస్ సీజన్ 8 తెలుగులో ముందు ఎంటర్ అయిన వారు, వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ మొత్తం 22 మంది పాల్గొనగా ఫినాలే వీక్కి చేరేసరికి…
నేటి నుంచి తిరిగి తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం. ముగ్గురు మాజీ సభ్యులకు సంతాపం తెలపనున్న సభ. ఇంద్రసేనారెడ్డికి సంతాపం తెలపనున్న శాసనమండలి. రెండు బిల్లులను ఆమోదించనున్న తెలంగాణ అసెంబ్లీ. స్పోర్ట్స్, తెలంగాణ వర్సిటీ సవరణ బిల్లులకు ఆమోదం. టూరిజం పాలసీపై స్వల్పకాలిక చర్చ ఉండే అవకాశం. నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం. మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీహాల్లో కేబినెట్ భేటీ. నేడు పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన. ఉదయం 11 గంటలకు పోలవరం ప్రాజెక్ట్కు చంద్రబాబు.…
Ponguleti Srinivas Reddy : ప్రజాపాలనలో అప్లై చేసి కొని వాళ్ళు కూడా ఇందిరమ్మ ఇళ్లలో అప్లై చేసేకునే అవకాశం ఉందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల యాప్లో 10 కొత్త అంశాలు చేర్చాము. సర్వే అధికారుల రికమండేషన్ ఆప్షన్ తీసివేశామని, ఇప్పటి వరకు 2లక్షల 32 వేల దరఖాస్తులను యాప్ లో నమోదు చేశామన్నారు. ఆలస్యం అయిన అసలైన లబ్ధి దారులకు ఇల్లు ఇవ్వడమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఐటీడీఏ, ట్రైబల్ ఏరియాలో…
Training For MLAs And MLCs: హైదరాబాదు నగరంలోని డా. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో బుధ, గురు వారాల్లో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు శిక్షణా తరగతులు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనపరిషత్తు సభ్యులకు ఏర్పాటు చేసిన ఓరియెంటేషన్ ప్రోగ్రాం ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, లేజిస్లేచర్ సెక్రటరీ నరసింహా చార్యులు పరిశీలించారు. ఈ సందర్బంగా MCHRD స్పెషల్…
KCR : అధికారం లోకి వచ్చి ఏడాది కాలం పూర్తి చేసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామని, ప్రభుత్వ చేతకాని తనం వల్ల అస్తవ్యస్తంగా మారిన పాలనకు విసుగుచెందిన రాష్ట్ర ప్రజలు తిరగబడుతున్న నేపథ్యంలో, తెలంగాణను తెచ్చి పదేండ్లు ప్రగతి పథాన నిలిపిన పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎక్కడికక్కడ ప్రభుత్వ ప్రజావ్యతిరేక వైఖరులను నిలదీయాలని, అందుకు సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీని వేదికగా చేసుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గొంతు…
హన్మకొండ ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ అంటే ప్రపంచ దేశాలకు ఉక్కు మహిళ అని కొనియాడారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయాలని ఉక్కు సంకల్పంతో ఉన్నామని, ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే నేను సీఎం అయ్యానని ఆయన అన్నారు.