మాజీ మంత్రి హరీష్ రావు పై రాష్ట్ర ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. హరీష్ రావు వేములవాడ రాజన్న దర్శనం చేసుకొని తప్పయింది మేము రాజన్న కి ఇచ్చిన మాట తప్పాము అని క్షమించు అని ఆడుగుతాడు అనుకున్నామని, సోనియా తెలంగాణ ఇస్తేనే కదా కేసీఆర్ సీఎం అయ్యాడు, మీకు పదవులు వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ అన్నారు.
తెలంగాణలో పార్టీలో ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అనర్హత విధించేందుకు సంబంధించి హైకోర్టులో మంగళవారం విచారణ ముగిసింది. అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) ధర్మాసనం వాదనలు విని తీర్పును రిజర్వు చేసింది.
ట్విట్టర్( X) వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ మొత్తాన్ని మోసం చేశావని, మీ “గ్యారంటీలు” చక్కటి ముద్రణ , ఖాళీ వాగ్దానాలతో నిండి ఉన్నాయి. మీరిచ్చిన గ్యారంటీ కార్డు లో షరతులు వర్తిస్తాయని విషయం తెలంగాణ అమాయక ప్రజలకు తెలియదన్నారు బండి సంజయ్.
Social Media Posts: అసెంబ్లీ స్పీకర్ పై అనుచిత పోస్టులు చేసిన వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. వికారాబాద్ మోమిన్ పేట కు చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తి తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాలలో స్పీకర్ మాట్లాడిన వీడియోలను సేకరించాడు.
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఇందులో ఉద్యోగాల సంఖ్య ఉండదని, నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే ప్రకటిస్తామని తెలిపారు. ఇది కేవలం ప్రకటన మాత్రమేనని దీనిపై చర్చ ఉండదని అసెంబ్లీలో భట్టి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక TGPSCని ప్రక్షాళన చేశామని, కొత్త నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని వివరించారు. గ్రూప్ 2 పరీక్షను ఆగస్టు 7 8 తేదీల్లో నుండి డిసెంబర్ కు వాయిదా వేయటమైంది. రాష్ట్రంలో అనేక…
KTR: తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెడితే స్వాగతిస్తామని కేటీఆర్ అన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి లేఖ రాశారన్నారు. సురవరం ప్రతాపరెడ్డి పేరు తెలుగు విశ్వవిద్యాలయంకి పెట్టాలి అని అడిగారన్నారు.
Telangana Assembly 2024: నేడు తొమ్మిదవ రోజు అసెంబ్లీ సమావేశం కానుంది. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవాల్టితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి.
తెలంగాణ అసెంబ్లీలో ఇక నుంచి పాత దృశ్యాలు కొత్తగా కనిపిస్తాయా? ప్రతిపక్షం విషయంలో కఠినంగానే ఉండాలని ప్రభుత్వం డిసైడ్ అయిందా? పద్ధతిగా సభ నడుపుదామని తాము అనుకుంటుంటే… ప్రతిపక్షం మాత్రం కట్టు తప్పి ప్రవర్తిస్తున్నట్టు సర్కార్ పెద్దలు భావిస్తున్నారా? ఆ విషయంలో సీఎం అంతరంగం ఎలా ఉంది? కనిపించబోయే కొత్త దృశ్యాలు ఏవి? ఇన్నాళ్ళు సజావుగానే సాగుతోంది తెలంగాణ అసెంబ్లీ. ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేసినా…, నిరసనలు స్పీకర్ పోడియం వరకు వచ్చినా, పెద్దగా పట్టించుకోలేదు ప్రభుత్వం.…
BRS MLAs: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే నిరసనగా బీఆర్‌ఎస్ శాసనసభ్యులు నల్లబ్యాడ్జీలు ధరించి సభకు హాజరయ్యారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ధన్యవాదాలు తెలిపారు.
MLA Harish Rao: అసెంబ్లీలో బిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై రేవంత్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. నిండు అసెంబ్లీ సాక్షిగా బిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సభానాయకులు, రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది యావత్ మహిళా లోకానికి జరిగిన అవమానం. ముఖ్యమంత్రి వెంటనే బిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని., పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో అసెంబ్లీ సమావేశాలు ఎంతో హుందాగా నిర్వహించామని.,…