Telangana Budget 2024 : అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రి భట్టి విక్రమార్క.. శాఖలకు కేటాయింపులివే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Budget 2024 : ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ఆశించిన స్థాయి అభివృద్ధి జరుగలేదని, అప్పులు మాత్రం పది రెట్లు పెరిగాయని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే దాశరథి కవితతో’ బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. గత పదేళ్లలో అభివృద్ధి, సంక్షేమం సన్నగిల్లిందని, గత పదేళ్లలో అస్తవ్యస్త పాలన సాగడంతో అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా మారిందన్నారు. గత ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలు ఎక్కడ నెరవేర్చలేదని, ఆర్థిక క్రమ శిక్షణ పాటించలేదని, జీతాలు, పింఛన్ల చెల్లింపులకు నానాఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వంలో నాయకులు బంగారు తెలంగాణ అంటూ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారంటూ మండిపడ్డారు.
మొత్తం తెలంగాణ బడ్జెట్: రూ.2,91,159 కోట్లు
ఇందులో రెవెన్యూ వ్యయం: రూ. 2, 20, 945 కోట్లు
మూలధన వ్యయం: రూ.33,487 కోట్లు
వ్యవసాయం: రూ.72,659 కోట్లు
ఎస్‌సి సంక్షేమం: రూ.33,124 కోట్లు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.29,816 కోట్లు
వైద్య ఆరోగ్యం: రూ.11,468 కోట్లు
బిసి సంక్షేమం: రూ.9200 కోట్లు
ట్రాన్స్‌కో, డిస్కంలు: రూ.16,410 కోట్లు
అడవులు, పర్యావరణం: రూ.1064 కోట్లు
ఎస్‌టి సంక్షేమం: రూ.17056 కోట్లు
మైనార్టీ సంక్షేమం: రూ.3003 కోట్లు
స్త్రీ, శిశు సంక్షేమం: రూ.2736 కోట్లు
Also Read
హార్టికల్చర్‌కు రూ.737 కోట్లు కేటాయింపు
రోడ్లు, భవనాలకు రూ.5,790 కోట్లు
హోంశాఖకు రూ.9,564 కోట్లు
పశుసంవర్ధక శాఖకు రూ. 1,980 కోట్లు
విద్యాశాఖకు రూ. 21,292 కోట్లు
నీటి పారుదల శాఖకు రూ.22,301 కోట్లు
ప్రజాపంపిణీకి రూ.3,836 కోట్లు
గృహజ్యోతికి రూ.2,418 కోట్లు
పరిశ్రమల శాఖకు రూ.2,762 కోట్లు
ఐటీ శాఖకు రూ.774 కోట్లు
500 రూపాయల గ్యాస్ సిలిండర్‌కు రూ.723 కోట్లు
బీసీ సంక్షేమానికి రూ.9,200 కోట్లు
రీజినల్ రింగ్‌రోడ్‌కు రూ.1525 కోట్లు
జీహెచ్‌ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.3,065 కోట్లు
అప్పులకు వడ్డీల కోసం రూ. 17,729 కోట్లు
అలాగే
హెచ్‌ఎండీఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.500 కోట్లు
మెట్రో వాటర్ వర్క్స్ కోసం రూ.3385 కోట్లు
హైడ్రాకు రూ.200 కోట్లు
ఎయిర్‌పోర్టు వరకు మెట్రో విస్తరణకూ రూ.100 కోట్లు
ఔటర్ రింగ్ రోడ్డు కోసం రూ.200 కోట్లు
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం రూ.500 కోట్లు
మల్టీ మోడల్ సబర్బన్ రైలు ట్రాన్స్‌పోర్టు సిస్టంకు రూ.50 కోట్లు
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కోసం రూ.1,500 కోట్లు
హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం రూ.10 వేల కోట్లు
ఇందిరా మహిళా శక్తి పథకానికి రూ.50.41 కోట్లు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్న అభివృద్ధిని ఆపలేదని భట్టి విక్రమార్క అన్నారు. డిసెంబర్ నుంచి పథకాల కోసం రూ.34,579 కోట్లు ఖర్చు చేశామన్నారు. ప్రతి నెల 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు చెల్లిస్తున్నాం.. గతంలో పేపర్ లీకులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే 31,768 ఉద్యోగ నియామక పత్రాలు అందించామన్నారు. త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం.. ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం.. ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
తాజావార్తలు
-
Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
-
Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
-
KTR : కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. కేటీఆర్ ఫైర్.!
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!