Telangana Assembly On Wednesday: బుధవారం నాడు జరిగిన అసెంబ్లీ సమావేశాలలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. ఈ నేపథ్యంలో మండలిలో సభ్యులైన.. తాతా మధు ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. మేడిగడ్డలో నీళ్ళు వృథాగా పోతున్నాయి. ప్రాజెక్ట్ లలో నీళ్ళు అడుగంటునయి. ప్రాజెక్ట్ లలో నీటి నిల్వ కోసం ఏమి చర్యలు తీసుకుంటుంది అంటూ ప్రశ్నలను ఆయన లేవనెత్తాడు. ఇక ఇందుకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానమిస్తూ.. గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వలన మేడిగడ్డ వద్ద వృథాగా నీళ్ళు పోతున్నాయి.. అయినప్పటికీ సాగు నీటి ప్రాజెక్ట్ లలో నీటిని నిల్వ చేయడం వలన సాగు నీటి తాగు నీటి సమస్యలు రావడం లేదుని తెలుపుతూ.. ప్రస్తుతం కొనసాగుతున్న రేషన్ కార్డులు చెలామణి అవుతాయి. కొత్త వాళ్ళకు, అర్హులైన వారికి త్వరలో రేషన్ కార్డులు ఇస్తాము. గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని ఆయన అన్నారు.
Olympics 2024: వామ్మో.. ఒలంపిక్స్ కోసం ప్రభుత్వం ఇన్ని కోట్లు ఖర్చు పెడుతోందా..?
ఇక సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గోదావరిలో వరద లేదు. ప్రాణహితలో వరద బాగా వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని బ్యారేజ్ లు సక్రమంగా నిర్మించకపోవడం వలన నీళ్ళు వృథాగా పోతున్నాయని ఆయన అన్నారు. రైతు భరోసా అమలు చేయడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వం వ్యవహారం వలన 26,000 వేల కోట్లు నిధులు వృథా అయ్యాయి. రైతు భరోసా పై గైడ్ లైన్స్ ఎలా ఉండాలనేది రెండు సభలలో చర్చిస్తాం. ఆగస్టు 31 లోపు రుణమాఫీ పూర్తి చేస్తాము అని ఆయన తెలిపారు.
Bengaluru: అర్ధరాత్రి హస్టల్‌లోకి చొరబడి, యువతి గొంతు కోసి హత్య..
ఇక మరోవైపు ఎమ్మెల్సీ వాణీ దేవి మాట్లాడుతూ.. పెండింగ్ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారని ప్రశ్నించగా.. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క.. జీతాలు ఒకటవ తేదిన ఇస్తున్నాము.. అలాగే నిధులు త్వరలో విడుదల చేస్తాము.. ఇంకా గృహ లక్ష్మి పథకంను మార్చి 1 నుండి అమలు చేస్తున్నాము. ఇప్పటి వరకు ఒక కోటి 79,33,430 మందికి జీరో బిల్లులు అమలు చేశాము. 640.9 కోట్లు డిస్కంలకు చెల్లించాము.. ఒక నెల ఎక్కువగా వస్తే పథకం నుండి వారిని తీసివేయము. ఇక అదే సభలో ఎమ్మెల్సీ చింతపండు నవీన్ మాట్లాడుతూ.. గ్రూప్ 1 పోస్టులలో 1:50 అమలు చేయడం వలన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి యూపిఎస్సి తరహాలో అమలు చేయాలని డిమాండ్ చేసారు.