KTR In Assembly : నేడు మొదలైన తెలంగాణ అసెంబ్లీలో లాస్య నందిత సంతాప తీర్మానంపైన కేటీఆర్ కామెంట్స్ చేసారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే దివంగత సాయన్న గారు నిబద్ధతతో కలిసి పనిచేసిన వ్యక్తి అని., సాయన్న కోరినట్టు కవాడిగూడ నుంచి లాస్యను గెలిపించుకున్నము., సాయన్న మరణం నుంచి అప్పడప్పుడే కోలుకుంటున్న ఆ కుటుంబం మరోసారి విషాదకరమైన వార్త వినాల్సి వచ్చింది., సాయన్న కుమార్తె లాస్య నందిత కూడా యాక్సిండెంట్ కు గురై చనిపోవటం అత్యంత ఆవేదన కలిగించిన అంశం అంటూ పేర్కొన్నాడు. ఏడాదిలోపే తండ్రి, కూతురు మరణించటమంటే ఆ వార్త వినటానికే ఎంతో ఆవేదనగా ఉంటుందని., అలాంటిది ఆ కుటుంబం ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొందో తలచుకుంటేనే బాధ అవుతుందంటూ అయ్యన పేర్కొన్నారు.
Revanth Reddy: అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి..
సాయన్న కుటుంబానికి అండగా ఉంటామని కెసిఆర్ ఇదే శాసనసభలో హామీ ఇచ్చారు., లాస్య నందిత చాలా చురుకైన అమ్మాయి., సాయి అన్న సేవలు పార్టీ అండతో లాస్య గెలిచి అసెంబ్లీలోకి వచ్చింది., సాయన్న మాదిరిగానే ప్రజా సేవ చేయాలనుకున్న లాస్య నందితకు మంచి అవకాశం వచ్చింది., లాస్య కారు ప్రమాదానికి వారం ముందు కూడా నల్గొండ బహిరంగ సభలోనూ యాక్సిడెంట్ జరిగింది., తండ్రి మరణం ఆ తర్వాత నల్గొండ సభలో జరిగిన యాక్సిడెంట్ ఇలా విధి వారి పై పగబట్టిందంటూ ఆయన అన్నారు. కానీ., తన సంతాపం తెలిపే పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ కుటుంబానికి పార్టీ పరంగా అన్ని విధాలుగా అండగా నిలవాలన్న కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ కుటుంబానికి పార్టీ అండగా నిలిచింది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనూ మళ్లీ ఆ కుటుంబంలోనే సాయన్న గారి మరో కూతురు నివేదితకు పార్టీ సీటును కేటాయించింది. కాకపోతే దురదృష్టవశాత్తు తాను ఓడిపోవటం జరిగిందని., తండ్రి, కూతురును కోల్పోయిన ఆ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఆయన అన్నారు.
Double ismart: ఓవర్సీస్ రైట్స్ దక్కించుకున్న బడా నిర్మాత..ఎవరంటే..?