Training For MLAs And MLCs: హైదరాబాదు నగరంలోని డా. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో బుధ, గురు వారాల్లో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు శిక్షణా తరగతులు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనపరిషత్తు సభ్యులకు ఏర్పాటు చేసిన ఓరియెంటేషన్ ప్రోగ్రాం ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, లేజిస్లేచర్ సెక్రటరీ నరసింహా చార్యులు పరిశీలించారు. ఈ సందర్బంగా MCHRD స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశాంక్ గోయల్, సంబంధిత అధికారులు చేసిన ఏర్పాట్లను వివరించారు. శాసన సభ్యులు, శాసన పరిషత్తు సభ్యులు ఈ అవగాహన కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరుకావాలని స్పీకర్ ప్రసాద్, చైర్మన్ గుత్తా సూచించారు.
Also Read: Mohan Babu: నిన్ను ఎలా పెంచాను రా మనోజ్.. మోహన్ బాబు సంచలన ఆడియో
ఇకపోతే తాజాగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యుల ఓరియంటేషన్ సెషన్‌ను భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ బహిష్కరించనున్నట్లు కేటీఆర్ ఓ ప్రకటన విడుదల చేసారు. మొదటి రోజే మమ్మల్ని లోపలికి రాకుండా పోలీసులతో అరెస్టు చేయించారని, శాసనసభ ప్రారంభానికి ముందే మా హక్కులకు భంగం కలిగేలా స్పీకర్ వ్యవహరించారని కేటీఆర్ అన్నారు. ప్రజా సమస్యలను ఎత్తిచూపేందుకు నిరసన తెలిపితే అరెస్టు చేసారని ఆయన అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను తెలిపేందుకు, మా పార్టీ శాసనసభ్యుల అక్రమ పార్టీ ఫిరాయింపుల పై నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ నాన్చివేత ధోరణి చేస్తున్నారని ఆయన అన్నారు