Bhatti Vikramarka vs Harish Rao: తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు ప్రారంభంతోనే రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై వాడి వేడీ చర్చ మొదలైంది. అటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఇటు మాజీ మంత్రి హరీష్ రావు వాదనలతో అసెంబ్లీ దద్దరిల్లింది. సభలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన చేపట్టారు. డిప్యూటీ సీఎం నీ సభలోకి పిలవాలని డిమాండ్ చేశారు. అనంతరం అసెంబ్లీలో వచ్చిన డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. గత ఏడాది 52 వేల కోట్లు మాత్రమే అప్పు తీసుకున్నామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రశ్నోత్తరాల లో ఎలా ఉండాలి అనేది హరీష్ రావుకి తెలియదని అనుకుంట అని భట్టి విక్రమార్క అన్నారు.
Read also: Zebra contest : ఆహా OTT జీబ్రా కాంటెస్ట్ లో గిఫ్ట్ లు గెలుచుకునే అవకాశం
షార్ట్ డిస్కషన్‌లో లాగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అప్పులపై చర్చకు మేం సిద్ధమని తెలిపారు. మీలాగా మేము వెనక్కి పోమన్నారు. ప్రజల కోసం పని చేసే మాపై ప్రివిలేజ్ మోషన్ అంట అని మండిపడ్డారు. అధికారం పోయాకా.. అంత మర్చిపోయారని తెలిపారు. అలా శాసించడం ఏంటి అధ్యక్ష చైర్ నీ అని భట్టి మండిపడ్డారు. సభాపతి అంటే గౌరవం ఉండొద్దా? అన్నారు. బీఏసీ లో పదేళ్లు ఏం చేశారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకేం చర్చ చేయాలో స్పీకర్ కి ఇవ్వండి అని అప్పట్లో చెప్పే వారన్నారు. నిన్న మేము కూడా అదే చెప్పామన్నారు. స్పీకర్ కి మీరు ఏం చర్చ చేయాలని అనుకుంటున్నారో ఇవ్వండి అని చెప్పామన్నారు. లేదు… అది కరెక్ట్ కాదు.. అని వాకౌట్ చేశారని గుర్తుచేశారు. పోచారం స్పీకర్ గా ఉన్నప్పుడు నిర్ణయం ఆయన చేసుకున్నారని తెలిపారు.
Read also: Blast: అమృత్‌సర్ పోలీస్‌స్టేషన్ దగ్గర పేలుడు కలకలం
కానీ గడ్డం ప్రసాద్ చెప్పింది మాత్రం లేదు.. మేము వినం అంటున్నారని భట్టి తెలిపారు. పోచారంకి ఒక గౌరవం… స్పీకర్ గా ప్రసాద్ కుమార్ కి ఇచ్చే గౌరవం ఇదా..? అని ప్రశ్నించారు. ఇదేం పద్ధతి? అని మండిపడ్డారు. మీరు శాసించినట్టు సభ నడవదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష కోట్ల అప్పు చేయలేదు.. రూ.52 వేల కోట్లు అప్పు చేశామన్నారు. అప్పులకు 65 వేల కోట్లు కట్టామన్నారు. రూ. 40 వేల కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టారన్నారు. అప్పులు కడుతూ… పెండింగ్ బిల్లులు చెల్లిస్తూ పోతున్నామన్నారు. రూ.40 వేల కోట్లలో 14 వేల కోట్లు చెళ్ళించామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కోరుకునే వాళ్ళు దీన్ని తప్పు పట్టరని తెలిపారు. ధాన్యం కొన్న మూడు రోజులకే డబ్బులు ఇస్తున్నామని తెలిపారు. మీ మోకానికి పదేళ్లలో ఎప్పుడైనా ఇచ్చారా..? అని మండిపడ్డారు. బోనస్ కూడా సన్నాలకి ఇస్తున్నామన్నారు. మ నియోజక వర్గం లో చిట్టిబాబు అనే రైతు నాకు మేసేజ్ పెట్టారు..బోనస్ నాకు వచ్చింది… మంచి జరిగింది అని భట్టి తెలిపారు.
Read also: Manipur CM: మణిపూర్ సీఎం ఇంటి సమీపంలో బాంబు కలకలం..
హరీష్ రావు మాటలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అప్పులపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు శాసనసభలో ఘాటుగా స్పందించారు. ఏడాదికి రూ.52 వేల కోట్లు మాత్రమే రుణం తీసుకున్నామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం కింద తీసుకున్న రుణాలు రూ. 51 వేల 277 కోట్లు. ఈ ఉదయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ కూడా తీసుకున్నాను. ఇవాళ కలిపితే మరో రూ. 3 వేల కోట్లు. అంటే రూ. ఎఫ్‌ఆర్‌బీఎం కింద 55, 277 కోట్లు తీసుకున్నారు. రూ. 61,991 కోట్లు కార్పొరేషన్ హామీల కింద తీసుకోగా మరో రూ. 10,099 కోట్లు హామీలు లేకుండానే తీసుకున్నారు. మొత్తంగా ఈ ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అప్పు రూ. 1,27,208 కోట్లు.. ఇలాగే కొనసాగితే 5 ఏళ్లలో రుణం రూ. 6,36,040 కోట్లు అని హరీష్ రావు తెలిపారు.
Online Betting Suicide: పబ్జి గేమ్ ద్వారా పరిచయం.. ఆన్లైన్ బెట్టింగ్ ఉచ్చుకు నిండు ప్రాణం బలి