ఈ-ఫార్ములా కార్ రేసింగ్ అంశంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. దమ్ముంటే ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని ఆయన సవాల్ విసిరారు. రాష్ట్రంలోని అన్ని సమస్యలపై చర్చించేందుకు సిద్ధమని వెల్లడించారు. కేబినెట్లో మాట్లాడటం సరికాదని.. సభలో చర్చ చేద్దామంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ-కార్ రేసింగ్‌పై విచారణకు గవర్నర్ ఆమోదంపై కేటీఆర్ తొలిసారి స్పందించారు.
విపక్షాల నిరసనల మధ్య తెలంగాణ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. లగచర్లకు రైతులకు బేడీల అంశంపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టాయి. బీఆర్ఎస్, బీజేపీలు వాయిదా తీర్మానాల కోసం డిమాండ్ చేశాయి. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ శాసనసభ్యుల నిరసన మధ్య మూడు కీలక బిల్లులకు సభ ఆమోదం తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. శాసన సభను కూడా వాళ్ళ అబద్ధాలను నిజాం చేసుకునేందుకు వాడుకుంటున్నారని ఆరోపించారు. స్పీకర్ కూడా వారికి రూల్స్ తెలియజేసే ప్రయత్నం చేయడం లేదన్నారు.
గిరిజన రైతుల గురించి చర్చించాలని చర్చకు పట్టుబడితే సభను వాయిదా వేయడాన్ని తప్పుబడుతున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా వ్యాఖ్యానించారు. రైతులకు బేడీలు వేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. సభ జరిగినన్నీ రోజులు గిరిజన రైతుల పక్షాన పోరాడుతామన్నారు. శాసన మండలిలో బీఆర్ఎస్ సభ్యుల నిరసన నేపథ్యంలో శాసనమండలి బుధవారానికి వాయిదా పడింది.
Bhatti Vikramarka vs Harish Rao: తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు ప్రారంభంతోనే రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై వాడి వేడీ చర్చ మొదలైంది. అటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఇటు మాజీ మంత్రి హరీష్ రావు వాదనలతో అసెంబ్లీ దద్దరిల్లింది.
ఐదుగురు ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా భట్టి విక్రమార్క రోజూ సభకు వచ్చారని.. 38 మంది ఉన్న బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ ఎందుకు రావడం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి కంటే ఎక్కువ విలువ ప్రతిపక్ష నాయకుడికి ఉంటుందన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ ఖతం అవుతుంది అని కేసీఆర్ ముందే తెలుసుకొని సభకు రావడం లేదన్నారు.
తమ భూమి తమకే ఉండాలని కొట్లాడిన పాపానికి లగచర్ల రైతులను జైల్లో పెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. వారి మీద కేసులు పెట్టడమే కాకుండా వారిపై థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నారన్నారు. లగచర్ల ఘటనపై చర్చ పెడదాం అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు.
లగచర్ల రైతులకు బేడీల విషయంపై అసెంబ్లీ చర్చకు బీఆర్ఎస్ పట్టుబట్టింది. పర్యాటక శాఖపై కాకుండా లగచర్ల రైతులకు బేడీల విషయంపై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ శాసనసభ్యులు డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్లకార్డులు పట్టుకొని బీఆర్ఎస్ శాసన సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఇదేం రాజ్యం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.
పక్కాగా పోలీస్ ప్లానింగ్.. ఆల్ హ్యాపీస్! సెప్టెంబర్ 01 ఆదివారం నాడు ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 8 నిన్న ఆదివారంతో ముగిసింది. దాదాపు 105 రోజుల పాటు సాగిన బిగ్‌బాస్ సీజన్ 8లో విజేతగా కన్నడ నటుడు నిఖిల్ మలియక్కల్ బిగ్‌బాస్ సీజన్ 8 గెలిచి కప్ న అందుకున్నాడు. బిగ్‌బాస్ సీజన్ 8 తెలుగులో ముందు ఎంటర్ అయిన వారు, వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ మొత్తం 22 మంది పాల్గొనగా ఫినాలే వీక్కి చేరేసరికి…