Lalu Family Trouble: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి వరుస షాకులు తగులుతున్నాయి. ఓవైపు ఇంటి పోరుతో ఇబ్బంది పడుతున్న తరుణంలో.. ఇప్పుడు అధికారిక బంగ్లాలు ఖాళీ చేయాలనే కొత్తగా ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం ఆ ఫ్యామిలీకి తలనొప్పిగా మారింది.
Tej Pratap Yadav: రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కేంద్రానికి, కేంద్ర హోం మంత్రికి అరుదైన అభ్యర్థన చేశారు. తన తల్లిదండ్రులు మానసిక వేధింపులకు గురయ్యారా అని పరిశీలించి, దర్యాప్తు ప్రారంభించాలని కేంద్రాన్ని, బీహార్ ప్రభుత్వాన్ని కోరారు. ఆర్జేడీ నుంచి బహిష్కరణకు గురైన తేజ్ ప్రతాప్ ఎన్నికల ముందు జనశక్తి జనతాదళ్ అనే పార్టీని పెట్టి, మహువా నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
Lalu Family Crisis: బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయం లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీలో దుమారానికి కారణమైంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో, 243 సీట్లకు గానూ ఎన్డీయే కూటమి 202 సీట్లు సాధిస్తే, ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి 35 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఆర్జేడీ కేవలం 25 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
Bihar Elections: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగా అధికార ఎన్డీఏ కూటమి దూసుకుపోతుంది. ప్రతిపక్ష మహాఘట్‌బంధన్ కూటమి ఓటమి అంచున ఉంది. ప్రతిపక్ష కూటమి అధికారానికి దూరం కావడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి బీహార్ ఎన్నికల్లో తేజస్వి యాదవ్ పార్టీ ఆర్జేడీ ఓటమికి ప్రధాన కారణాల్లో కుటుంబ కలహాలు కీలకమైనవిగా విశ్లేషకులు పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు అన్నాదమ్ములు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ మధ్య ఒక రకంగా యుద్ధం…
Bihar Elections: బీహార్ మాజీ మంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మాయితో లవ్‌లో ఉన్నానని ప్రకటించిన తర్వాత తేజ్ ప్రతాప్‌ను ఆర్జేడీ నుంచి బహిష్కరించారు. ఈ నేపథ్యంలో ఆయన జనశక్తి జనతాదళ్ (JJD) పార్టీని పెట్టారు.
Bihar Elections 2025: దేశ వ్యాప్తంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కాకరేపుతున్నాయి. ఇప్పటికే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు జోరందుకున్నాయి. ఆ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మార్పులు సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ నుంచి తన పెద్ద కుమారుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. ఆర్జేడీ నుంచి సస్పెండ్ చేయడంతో తేజ్ ప్రతాప్ యాదవ్ ఏకంగా సొంత పార్టీ పెట్టుకొని ఈ ఎన్నికల బరిలోకి దిగారు.…
Bihar Elections: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ఎన్డీయే, మహాఘటబంధన్ కూటములు సీట్ల షేరింగ్‌పై చర్చోపచర్చలు నిర్వహిస్తున్నాయి. ఇదిలా ఉంటే, మరోవైపు రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో వివాదం మరింత ముదురుతోంది.
Tej Pratap Yadav: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారీ రాజకీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆ రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్టీ చీఫ్ అయిన లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తన కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. లాలూ పెద్ద కుమారుడు, మాజీ మంత్రి అయిన తేజ్ ప్రతాప్ తన కొత్త పార్టీ ‘‘జనశక్తి జనతాదళ్’’ను ఆవిష్కరించారు. రానున్న బీహార్ ఎన్నికల్లో అన్ని…
Bihar: కీలకమైన బీహార్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాష్ట్రంలో బీజేపీ-జేడీయూ కూటమికి, ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమికి కీలక పోరు నెలకొంది. అయితే, ఇప్పుడు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో నెలకొన్న వివాదాలు చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల హామీల కన్నా బీహార్ ప్రజలు లాలూ కుటుంబంలో ఏం జరుగుతుందో అనే ఆసక్తిని కనబరుస్తున్నారు. లాలూ ప్రసాద్ కూతురు రోహిణి ఆచార్య, కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్‌కు మరో కొడుకు తేజస్వీ యాదవ్‌తో పొసగ
Bihar: అసెంబ్లీ ఎన్నికల ముందు బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ వ్యవహారం ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఇటీవల, తేజ్ ప్రతాప్ తన ప్రియురాలు అనుష్క యాదవ్‌ని ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా పరిచయం చేశాడు. తామిద్దరం 12 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని, రిలేషన్‌లో ఉన్నామని చెప్పారు. దీని తర్వాత, లాలూ ఆర్జేడీ నుంచి తేజ్ ప్రతాప్‌ని 6 ఏళ్ల బహిష్కరించారు. పార్టీతో, కుటుంబంతో…