Bihar Elections: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగా అధికార ఎన్డీఏ కూటమి దూసుకుపోతుంది. ప్రతిపక్ష మహాఘట్‌బంధన్ కూటమి ఓటమి అంచున ఉంది. ప్రతిపక్ష కూటమి అధికారానికి దూరం కావడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి బీహార్ ఎన్నికల్లో తేజస్వి యాదవ్ పార్టీ ఆర్జేడీ ఓటమికి ప్రధాన కారణాల్లో కుటుంబ కలహాలు కీలకమైనవిగా విశ్లేషకులు పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు అన్నాదమ్ములు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ మధ్య ఒక రకంగా యుద్ధం జరిగిందని చెబుతున్నారు. ఇది ఎన్నికల ఫలితాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందని అంచనా వేస్తున్నారు.
READ ALSO: Shiva Re Release : యంగ్ హీరోలపై నాగార్జున ప్రభావం ఉంటుంది.. మంత్రి కోమటిరెడ్డి ట్వీట్
ఒకప్పుడు సమాజ్ వాదీ పార్టీ పరిస్థితి కూడా ఇంతే..
బీహార్‌లో ఆర్జేడీ పార్టీలాగానే ఒకప్పుడు ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్ పార్టీ సమాజ్‌వాదీది ఉండేది. కానీ ఆయన తర్వాత కాలంలో బలంగా తిరిగి పుంజుకున్నారు. కానీ 2017లో సమాజ్ వాదీ పార్టీ అధికారాన్ని కోల్పోవడానికి కుటుంబ కలహాలు ప్రధాన కారణంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అనంతర కాలంలో పార్టీలో శివపాల్ సింగ్ యాదవ్‌ను పక్కనపెట్టి అఖిలేష్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీపై తిరిగి నియంత్రణ సాధించాడు, కానీ అధికారాన్ని మాత్రం కోల్పోయాడు. కానీ అనంతర కాలంలో రాష్ట్రంలో అఖిలేష్ యాదవ్ రాజకీయంగా త్వరగా కోలుకున్నాడు. అచ్చం అఖిలేష్ యాదవ్ పరిస్థితి లాగానే బీహార్‌లో తేజస్వి యాదవ్ పరిస్థితి మారింది. కానీ ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్ కోలుకున్నంత త్వరగా బీహార్‌లో తేజస్వి కోలులేకదని, దీంతో ఆయన రాజకీయ జీవితం రాష్ట్రంలో గణనీయంగా క్షీణించిందని విశ్లేషకులు చెబుతున్నారు.
కంచుకోటలో ఇబ్బంది..
మహువా నుంచి పోటీలో ఉన్న తేజ్ ప్రతాప్ యాదవ్ తన స్థానంపై ఎలాంటి ఆశలు పెట్టుకుని ఉండకపోవచ్చు, కానీ లాలూ-రబ్రీల బలమైన కోట అయిన రాఘోపూర్‌లో తేజస్వి యాదవ్ పేలవమైన ప్రదర్శన కంటే లాలూ యాదవ్ కుటుంబానికి పెద్ద ఇబ్బంది ఏముంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే దానాపూర్‌లో రిత్లాల్ యాదవ్ కౌంటింగ్‌లో వెనుకబడి ఉండటం అంత ముఖ్యమైనది కాకపోవచ్చు, కానీ అది కచ్చితంగా లాలూ యాదవ్ జనాకర్షణ గురించి ప్రశ్నలను లేవనెత్తుతుందని చెబుతున్నారు. లాలూ యాదవ్ ఒకే ఒక రోడ్ షో నిర్వహించారు, అది కూడా విఫలమైందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ ఎన్నికల్లో తేజ్ ప్రతాప్ యాదవ్ కోల్పోయేది ఏమీ లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఆయనకు తన కుటుంబం నుంచి ఎలాంటి మద్దతు లేదని, తండ్రి వారసత్వం, పార్టీ చిహ్నం లాంటి ఏవీ లేవని చెబుతున్నారు. కానీ ఈ ఎన్నికల్లో తేజస్వి యాదవ్ భారీ కుదుపునకు లోనయ్యాడని వెల్లడించారు. ప్రస్తుతానికి ఆర్జేడీ పార్టీ నష్టాన్ని నియంత్రించే మార్గం కనుచూపు మేరలో లేదని అంటున్నారు.
ఓటమికి నాలుగు కారణాలు..
1. ప్రజల తిరస్కరణకు లాలూ యాదవ్ కుటుంబం:
తన వ్యక్తిగత ఫోటోలు ఎలా, ఎందుకు లీక్ అయ్యాయో తేజ్ ప్రతాప్ యాదవ్ స్వయంగా వివరించారు. తన అకౌంట్ హ్యాక్ అయి ఫోటోలు లీక్ అయ్యాయని ఆయన పేర్కొన్నారు. అయితే ఆ ఫోటోలు నకిలీవని ఆయన ఎప్పుడూ చెప్పలేదు. బహుశా తేజ్ ప్రతాప్ అప్పుడు అలాంటి ప్రకటన జారీ చేసి ఉంటే, మరిన్ని ఇబ్బందులను నివారించగలిగేవాడని విశ్లేషకులు చెబుతున్నారు. లాలూ యాదవ్ వెంటనే చర్య తీసుకుని తేజ్ ప్రతాప్ యాదవ్ ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే లాలు ఇప్పటికే తేజ్ ప్రతాప్‌ను తన రాజకీయ వారసత్వం నుంచి బహిష్కరించారు. ఈ ఘటన తర్వాత ఆయనను ఆర్జేడీ పార్టీ, తన కుటుంబం నుంచి కూడా బహిష్కరించారు. తేజస్వి యాదవ్ ఇప్పటికే పార్టీలో నాయకుడిగా ఉన్నారు, ఈ నిర్ణయం తర్వాత కుటుంబంలో కూడా అత్యున్నత అధికారి అయ్యారు. ఈ సంఘటనలన్నీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపించాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
2. తేజ్ ప్రతాప్ కేసులో గందరగోళం..
లాలూ యాదవ్ కుటుంబం నుంచి పార్టీ నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్ పూర్తిగా బహిష్కరించబడ్డారా? లాలూ యాదవ్ ప్రకటన, దానిపై తేజస్వి యాదవ్ స్పందన అదే విషయాన్ని సూచిస్తున్నాయి. కానీ ఇది నిజంగా జరిగిందా అనేది స్పష్టం తెలియలేదు. అయితే తేజ్ ప్రతాప్ యాదవ్‌కు తన కుటుంబంలో, పార్టీలోనూ గణనీయమైన సానుభూతి ఉందని పలు వర్గాలు సూచించాయి. అనేక మంది ఆర్జేడీ నాయకులు, ఆయన కుటుంబ సభ్యులు కూడా ఏదో ఒక కారణంతో ఆయనతో సంప్రదింపులు జరిపారని వెల్లడించాయి. ఎన్నికల ప్రచారంలో రబ్రీ దేవి , మిసా భారతి చేసిన ప్రకటనలు దీనికి మరింత రుజువు చేశాయని పలు నివేదికలు వెల్లడించాయి.
3. శత్రువులుగా కనిపించిన తేజ్ ప్రతాప్ – తేజస్వి
మహువాపై ఎవరైనా కన్ను వేస్తే రఘోపూర్‌లో కూడా స్పందన ఉంటుందని తేజ్ ప్రతాప్ యాదవ్ పదే పదే హెచ్చరించారు. తేజస్వి యాదవ్ రెండు నియోజకవర్గాల నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం గురించి అడిగినప్పుడు, తాను రఘోపూర్ నుంచి కూడా పోటీ చేస్తానని తేజ్ ప్రతాప్ స్పష్టంగా చెప్పారు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో సోదరులిద్దరూ బద్ధ శత్రువులుగా కనిపించారు. ఇది ఎన్నికలపై గణనీయమైన ప్రభావాన్ని చూపించిందని విశ్లేషకులు చెబుతున్నారు.
4. లాలూ ఇంటి గొడవను సద్వినియోగం చేసుకున్న ఎన్డీఏ
వాస్తవానికి ఈ ఎన్నికల్లో ఎన్డీఏ లాలూ కుటుంబ గొడవను సద్వినియోగం చేసుకుందనే కథనాలు వస్తున్నాయి. ఇదే సమయంలో ఎన్నికల చివరి దశలో తేజ్ ప్రతాప్ యాదవ్ NDA వైపు మొగ్గు చూపుతున్నారని పుకార్లు కూడా వచ్చాయి. అలాగే ఆయన కొన్ని షరతులతో తాను ఎవరికైనా మద్దతు ఇస్తానని కూడా ప్రకటించడం ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చాయి. ఇదే సమయంలో తేజ్ ప్రతాప్ యాదవ్‌కు Y+ కేటగిరీ భద్రత కూడా అందించారు. ఈ అన్ని పరిణామాలకు కారణం తేజస్వి యాదవ్, లాలూ యాదవ్ కలిసి చేసిన రాజకీయ తప్పిదమా అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజా ఎన్నికల ఫలితం అనేది కేవలం కుటుంబ కలహాల ఫలితమా అనే చర్చలు జరుగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
READ ALSO: Vakiti Srihari : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలుపు.. ప్రజల గెలుపు..