Tej Pratap Yadav: బీహార్ ఎన్నికల ముందు ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీ నుంచి తన పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్‌ని 6 ఏళ్లు బహిష్కరిస్తున్నట్లు లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. అయితే, ఈ నిర్ణయాన్ని ఆర్జేడీ నేత, లాలూ మరో కుమారుడు తేజస్వీ యాదవ్ సమర్థించారు. ఈ వివాదంపై తేజస్వీ మాట్లాడుతూ.. తన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ పెద్దవాడని, సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు ఆయనకు…
Tej Pratap Yadav: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆదివారం తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను పార్టీ నుంచి ఆరు సంవత్సరాల పాటు బహిష్కరించారు.
Tej Pratap Yadav: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తన గర్ల్‌ఫ్రెండ్ గురించి సోషల్ మీడియా పోస్టులో వెల్లడించారు. అనుష్క యాదవ్‌తో తనకు ఉన్న సంబంధాన్ని శనివారం ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా బయటపెట్టాడు. అనుష్క యాదవ్ గత 12 ఏళ్లుగా ప్రేమలో ఉన్నానని, రిలేషన్ కొనసాగిస్తున్నామని తేజ్ ప్రతాప్ యాదవ్ తెలిపారు.
Bihar: బీహార్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్ హోలీ వేడుకలు వివాదాస్పదంగా మారాయి. శనివారం ఆర్జేడీ నేత తన మద్దతుదారులతో హోలీని జరుపుకుంటున్న సమయంలో, యూనిఫాంలో ఉన్న ఒక పోలీస్ అధికారి పట్ల వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. ఆయన చర్యలపై అధికార జేడీయూ, బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.
Lalu Prasad Yadav: ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం కేసులో బీహార్ మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్, ఆయన తనయులు తేజస్వీయాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్‌కు ఢిల్లీ కోర్టులో బిగ్ రిలీఫ్ దొరికింది. కొద్దిసేపటి క్రితం బెయిలు మంజూరు చేస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశాలను జారీ చేసింది.
ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. నా కలలోకి రాముడు వచ్చి.. జనవరి 22న అయోధ్యకు వెళ్లబోమని చెప్పారు అని ఆయన పేర్కొన్నారు.
ఆదివారం భాగల్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడానికి బీజేపీనే కారణమని బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోపించారు. "బీజేపీ వంతెన కూలిపోవడానికి కారణమైంది. మేము వంతెనలను నిర్మిస్తాము.. బీజేపీ వాటిని నాశనం చేస్తూనే ఉంది" అని తేజ్ ప్రతాప్ యాదవ్ అన్నారు.