Tej Pratap Yadav: రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కేంద్రానికి, కేంద్ర హోం మంత్రికి అరుదైన అభ్యర్థన చేశారు. తన తల్లిదండ్రులు మానసిక వేధింపులకు గురయ్యారా అని పరిశీలించి, దర్యాప్తు ప్రారంభించాలని కేంద్రాన్ని, బీహార్ ప్రభుత్వాన్ని కోరారు. ఆర్జేడీ నుంచి బహిష్కరణకు గురైన తేజ్ ప్రతాప్ ఎన్నికల ముందు జనశక్తి జనతాదళ్ అనే పార్టీని పెట్టి, మహువా నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
Read Also: Nandyal: బ్యాంక్ సిబ్బందిని నిర్బంధించిన రైతులు.. బయట పడిన నకిలీ బంగారం బాగోతం
‘‘కొంత మంది వ్యక్తులు, జైచంద్‌లు నాతల్లిదండ్రులు లాలూ, రబ్రీదేవిలను మానసిక, శారీరక ఒత్తిడికి గురిచేయడానికి ప్రయత్నించారని కొంతమంది చెబుతున్నారు. ఇందులో నిజం ఉంటే, ఇది నా కుటుంబంపై జరిగిన దాడి మాత్రమే కాదు, ఆర్జేడీ ఆత్మకు ప్రత్యక్ష దెబ్బ. ఈ విషయంలో నిష్పాక్షికమైన, కఠినమైన, తక్షణ దర్యాప్తు నిర్వహించాలని నేను ప్రధానమంత్రి, అమిత్ షా జీ మరియు బీహార్ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను’’ అని సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు.
తన సోదరుడు తేజస్వీ యాదవ్ సన్నిహితులైన సంజయ్ యాదవ్, రమీజ్ ఖాన్‌లను తేజ్ ప్రతాప్ విమర్శించారు. అంతకుముందు, లాలూ కుమార్తె రోహిణి ఆచార్య కూడా ఇలాగే విమర్శలు చేశారు. ఈ వ్యక్తులు లాలూను, రబ్రీ దేవిని శారీరకంగా, మానసికంగా హించించారని తేజ్ ప్రతాప్ అనుమానాన్ని వ్యక్తం చేశారు. వీరిపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.