Bihar Elections 2025: దేశ వ్యాప్తంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కాకరేపుతున్నాయి. ఇప్పటికే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు జోరందుకున్నాయి. ఆ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మార్పులు సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ నుంచి తన పెద్ద కుమారుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. ఆర్జేడీ నుంచి సస్పెండ్ చేయడంతో తేజ్ ప్రతాప్ యాదవ్ ఏకంగా సొంత పార్టీ పెట్టుకొని ఈ ఎన్నికల బరిలోకి దిగారు. తాజాగా ఆయన తన పార్టీ జనశక్తి జనతాదళ్ పార్టీ నుంచి పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారో కూడా ఉంది.
READ ALSO: Delhi : పీఎం మోడీతో సీఎం చంద్రబాబు కీలక భేటి
మహువా అసెంబ్లీ నుంచి బరిలో దిగిన తేజ్ ప్రతాప్ యాదవ్
తేజ్ ప్రతాప్ యాదవ్ పార్టీ జనశక్తి జనతాదళ్ నుంచి 21 మంది అభ్యర్థులు పోటీ చేయనున్న అసెంబ్లీ స్థానాలను తెలిపారు. ఆయన స్వయంగా మహువా అసెంబ్లీ స్థానానికి పోటీ చేయనున్నట్లు ఈ జాబితాలో ప్రకటించారు. తేజ్ ప్రతాప్ యాదవ్ గతంలో మహువా అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా ఆయన ఈ స్థానం నుంచే బరిలో దిగనుండటంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. జనశక్తి జనతాదళ్ (జెడి) పార్టీ అనేక మంది కొత్త, యువ ముఖాలతో కూడిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఎన్నికల్లో ప్రజా సమస్యలను ప్రశ్నిస్తూ పోటీ చేస్తామని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈసందర్భంగా తేజ్ ప్రతాప్ యాదవ్ మాట్లాడుతూ.. యువతకు రాజకీయాల్లో కొత్త దిశానిర్దేశం చేయడం, బీహార్‌ను అభివృద్ధి పథంలో నడిపించడమే తమ పార్టీ లక్ష్యమని చెప్పారు. జనశక్తి జనతాదళ్ సామాన్య ప్రజల గొంతుకగా ఉంటుందని, అవినీతి, నిరుద్యోగం, పేదరికం వంటి సమస్యలపై బహిరంగంగా పోరాడుతుందని పేర్కొన్నారు.
తేజ్ ప్రతాప్ యాదవ్ అభ్యర్థాల జాబితా విడుదల చేయడం అనేది బాహాటంగా తన తండ్రికి, ఆర్జేడీకి సవాలు విసరడమే కాకుండా బీహార్ ఎన్నికల డైనమిక్స్‌పై కూడా ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తేజ్ ప్రతాప్ యాదవ్ 2015లో తొలిసారిగా ఎమ్మెల్యేగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నియోజకవర్గం మహువా. ఈ కొత్త జనశక్తి జనతాదళ్ (జెడి) జాబితా విడుదలతో, బీహార్ రాజకీయాల్లో కొత్త ఉత్సాహం వచ్చిందని అంటున్నారు. తేజ్ ప్రతాప్ తాజాగా నిర్ణయం రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనం అంటున్నారు. ఆయన అభ్యర్థులతో ఏ కూటమికి నష్టం వస్తుందో ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
READ ALSO: Victor Noir Grave: మతితప్పినదా.. మదమెక్కినదా? సమాధిపై ఆ పాడు పనులు ఏంటి!