విరాట్ కోహ్లీ టీ20 ఫార్మటు నుండి కెప్టెన్ గా తప్పుకున్న తర్వాత ఆ బాధ్యతలు భారత రోహిత్ శర్మ చేతిలో ఉంచింది బీసీసీఐ. అయితే ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీతో బీసీసీఐ వన్డే కెప్టెన్సీ భవిష్యత్తు గురించి మాట్లాడబోతున్నట్లు తెలుస్తుంది. వన్డే ఫార్మటు లో కూడా కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించాలని బోర్డు కోరుకుంటోందని తెలుస్తుంది. ఆ కారణంగా కోహ్లీన బ్యాటింగ్‌పై దృష్టి పెట్టి మళ్ళీ ఫామ్‌కి తిరిగి రావాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే వచ్చే ఏడాది జనవరి 11 నుంచి దక్షిణాఫ్రికా-భారత్ మధ్య ప్రారంభమయ్యే ద్వైపాక్షిక సిరీస్‌లో జట్టు వన్డే కెప్టెన్సీలో మార్పులు జరగవచ్చని బీసీసీఐ వర్గాలు అనుకుంటున్నట్లు తెలుస్తుంది. రోహిత్ శర్మకే 50 ఓవర్ల ఫార్మాట్‌లో కూడా కెప్టెన్సీ బాధ్యతలు.. కేఎల్ రాహుల్ కు వైస్ కెప్టెన్సీబాధ్యతలు ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం.