వరల్డ్ కప్ టీ20లో భారత్ సెమీస్ దశలోనే నిష్క్రమించిది. అయితే దీనిపై భారత జట్టు కూర్పు సరిగా లేదని అనేక విమర్శలు వెల్లువె త్తుతున్నాయి. పాకిస్తాన్ లాంటి జట్టు పై ఓడిపోవడం సగటు భారతీ య క్రికెట్ అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఐపీఎల్ పైన కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆట గాళ్లను విరా మం లేకుండా క్రికెట్ ఆడించడం భారత జట్టు టీ20 వరల్డ్ కప్‌లో ప్రదర్శన ఆశాజనకంగా లేదని చాలా మంది అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే టీం ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి దీనిపై క్లారిటీ ఇచ్చారు. జట్టు ఎంపిక సమయంలో తాను భాగస్వామ్యం కాలేదని ఓ టీవీ ఛాన ల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ కోచ్ రవిశాస్త్రి తెలిపారు. మ్యాచ్ ఆడే 11 మందితో కూడిన జట్టు ఎంపికలో తాను ఉన్నాని, 15 మందిని మాత్రం సెలక్టర్లు ఎంపిక చేశారని శాస్ర్తి స్పష్టతను ఇచ్చారు. 15 మందితో కూడిన జట్టు ఎంపికలో విరాట్ కోహ్లీ భాగస్వామ్యం కూడా లేదని ఆయన తెలిపాడు.