ఈ నెల 17 నుండి న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ కు భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, బుమ్రా, రవీంద్ర జడేజాలకు విశ్రాంతినిచ్చారు. దంతో చాలా మంది యువ ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. అందులో వెంకటేష్ అయ్యర్, హర్షల్ పటేల్ మరియు అవేష్ ఖాన్‌లు ఉన్నారు. వీరితో పాటుగా ఐపీఎల్ 2021 లో ఆరెంజ్ క్యాప్ విజేత రుతురాజ్ గైక్వాడ్ కూడా జట్టులో ఉన్నాడు. అయితే ఈ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ ఎంపికపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఒక ముఖ్యమైన కామెంట్ చేశాడు. గవాస్కర్ మాట్లాడుతూ… గైక్వాడ్ పై భారీ అంచనాలు ఉన్నాయని, ఈ రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌కు భవిష్యత్తులో మూడు ఫార్మాట్లలో భారత్‌కు సేవలందించే సామర్థ్యం ఉందని చెప్పాడు. అతనికి మంచి షాట్ ఎంపిక ఉందని…. అలాగే అద్భుతమైన టెక్నిక్‌ని కలిగి ఉన్నాడు అని గవాస్కర్ అన్నారు.