సౌత్ ఆఫ్రికా సిరీస్ లో భారత టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్ గా ఎంపికైన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నిన్న ప్రాక్టీస్ లో గాయపడ్డాడు. దాంతో ఈ సిరీస్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఈ టెస్ట్ సిరీస్ కు జట్టును ప్రకటిస్తున్న సమయంలోనే రోహిత్ ను భారత వన్డే జట్టుకు కెప్టెన్ గా నియమిస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సౌత్ ఆఫ్రికా పర్యటనలో టెస్ట్ సిరీస్ తర్వాత జరగనున్న వన్డే సిరీస్ లో ఆ బాధ్యతలను హిట్ మ్యాన్ చేపట్టనున్నాడు.
Read Also : సౌత్ ఆఫ్రికాతో జరిగే వన్డే మ్యాచ్ లకు దూరమైన కోహ్లీ…
కానీ ఇప్పుడు అతను గాయంతో టెస్ట్ సిరీస్ నుండి బయటకి రావడంతో వన్డే సిరీస్ కు కూడా దూరం అవుతాడు కావచ్చు అనే వార్తలు వస్తున్నాయి. కానీ తాజా సమాచారం ప్రకారం వన్డే సిరీస్ వరకు రోహిత్ కోలుకుంటాడు అని బీసీసీఐ వర్గాలు చెప్పినట్లు తెలుస్తుంది. అయితే రోహిత్ గాయం నుండి కోలుకోవడానికి ఒక్క నెల రోజుల సమయం పడుతుంది అని తెలుస్తుంది. ఇక సౌత్ ఆఫ్రికాతో మొదటి వన్డే మ్యాచ్ వచ్చే ఏడాది జనవరి 19న ప్రారంభం అవుతుంది. కాబట్టి రోహిత్ శర్మ వన్డే సిరీస్ కు అందుబాటులో ఉండనున్నట్లు అర్ధమవుతుంది.