భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం చాలా విమర్శలు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. 2019 ప్రపంచ కప్ తర్వాత వెన్నుముక చికిత్స చేయించుకున్న పాండ్యా ఇప్పటికి పూర్తి ఫిట్నెస్ ను సాధించలేదు. అతను అప్పటి నుండి ఇప్పటివరకు బౌలింగ్ చేయలేకపోతున్నాడు. అయితే పాండ్యా కు ఈ సమస్య గురించి తాను ముందే చెప్పను అని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ అన్నారు.
నేను పాండ్యాతో పాటుగా బుమ్రాకు కూడా చెప్పను. మీరు చాలా సన్నగా ఉన్నారు. అలాగే వారి వెన్ను కండరాలు బలంగా లేవు. నేను పాండ్యా వీపును తాకాను. అప్పుడు కండరాలు చాలా సన్నగా ఉన్నాయని.. గాయపడతావని నేను పాండ్యాను హెచ్చరించాను. నేను అలా చెప్పిన… గంటన్నర తర్వాత పాండ్యా గాయపడ్డాడు అని అక్తర్ చెప్పాడు. అయితే 2018 లో జరిగినా ఆసియా కప్ లో మొదటిసారి బౌలింగ్ చేస్తున్నప్పుడు వెన్ను సమస్యకు గురైన పాండ్యాను అది అప్పటి నుండి వేధిస్తూనే ఉంది.