సౌత్ ఆఫ్రికాలో ఓమైక్రాన్ కేసులు పెరుగుతున్న సమయంలో టీం ఇండియా అక్కడికి వెళ్తుందా లేదా అనే ప్రశ్న వచ్చింది. కానీ జట్టు అక్కడికి సౌత్ ఆఫ్రికా అని బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. కానీ అంతకంటే ముందే భారత ఏ జట్టు అక్కడికి వెళ్లి సౌత్ ఆఫ్రికా ఏ జట్టుతో మ్యాచ్ లు ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ జట్టుకు ప్రియాంక్ పంచాల్ న్యాయకత్వం వహిస్తున్నాడు. అయితే ఇక అక్కడికి మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కోసం వెళాల్సిన భారత ఓపెనర్ రోహిర్ శర్మ గాయం కారంణంగా తప్పుకున్నాడు. దాంతో ఇప్పుడు ఆ స్థానంలోని ప్రియాంక్ పంచాల్ టీం ఇండియాలోకి వచ్చాడు.
Read Also : సౌత్ ఆఫ్రికాతో జరిగే వన్డే మ్యాచ్ లకు దూరమైన కోహ్లీ…
అయితే తన మొదటి ఈ టెస్ట్ కాల్ పై ప్రియాంక్ స్పందిస్తూ చాలా సంతోషంగా ఉంది అని చెప్పాడు. అలాగే తన కెరియర్ మొదటి నుండి రాహుల్ ద్రావిడ్ నే ఫాలో అవుతున్నాను అన్నారు. మొదటిసారి 2019 లో భారత ఏ జట్టు కెప్టెన్సీ తనకు వచ్చినప్పుడు కూడా ద్రావిడ్ తో మాట్లాడినట్లు చెప్పాడు. అయితే ఎక్కువ సంతోష పడకు అని ద్రావిడ్ చెప్పాడు. ఎందుకంటే.. అతి ఆనందంలో మనం ఏం చేస్తానేమో మనకే తెలియదు అని ద్రావిడ్ తనకు వివరించినట్లు పేర్కొన్నాడు.