Nishant Kumar: జేడీయూలో చేరిన సీఎం నితీష్ కుమార్ తనయుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nishant Kumar: బీహార్‌లో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జేడీయూ అధినేత, సీఎం నితీష్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్ పార్టీలో చేరారు. ఆదివారం 50 ఏళ్ల నిశాంత్ కుమార్ ఈ రోజు అధికారికంగా జేడీయూలో చేరారు. రెండు దశాబ్ధాలకు పైగా బీహార్ రాజకీయాలను శాసిస్తున్న నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి త్వరలో రాజీనామా చేయబోతున్నారు. మార్చి 16న రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ పత్రాలు కూడా దాఖలు చేశారు. దీని తర్వాత ఆయన సీఎం పదవిని వదులుకోనున్నారు. మరోవైపు, బీహార్ రాష్ట్రానికి బీజేపీ నేత ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ నేపథ్యంలో నిశాంత్ కుమార్‌ను డిప్యూటీ సీఎంగా చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
జేడీయూలో చేరిన తర్వాత నిశాంత్ మాట్లాడుతూ.. ‘‘నేను పార్టీని జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నిస్తాను. నా తండ్రి రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇది ఆయన వ్యక్తిగత నిర్ణయం. దానిని అంగీకరిస్తున్నాం. ఆయన మార్గదర్శకత్వంలో మేము పనిచేస్తాము. పార్టీ, ప్రజలు నమ్మకానికి అనుగుణంగా పనిచేస్తాను’’ అని అన్నారు.
Also Read
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
- Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
ఇంజనీర్ అయిన నిశాంత్ కుమార్ సీఎం కుమారుడైనప్పటికీ రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నారు. జేడీయూ సీనియర్ నేతలు నిశాంత్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వడాన్ని స్వాగతించారు. మరోవైపు, బీహార్‌లో ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ బీజేపీపై విమర్శలు గుప్పిస్తోంది. బీజేపీ రాజకీయాలకు జేడీయూ ఓటర్లు మోసపోయారని చెప్పింది. వెనిజులాలో మదురోను అమెరికా అరెస్ట్ చేసి తీసుకెళ్లినట్లు, నితీష్ కుమార్‌ను కిడ్నాప్ చేసి, కేంద్రానికి తీసుకెళ్తున్నారని విమర్శించింది.
తాజావార్తలు
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?