Team India: జింబాబ్వే పర్యటనకు భారత జట్టు ప్రకటన.. కోహ్లీకి అవకాశం ఇవ్వని సెలక్టర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India For Zimbabwe Tour: ప్రస్తుతం వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న టీమిండియా త్వరలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. అక్కడ జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ మేరకు జింబాబ్వే వెళ్లే భారత జట్టును శనివారం నాడు సెలక్టర్లు ప్రకటించారు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఇతర సీనియర్ ఆటగాళ్లందరికీ ఈ పర్యటన నుంచి విశ్రాంతి కల్పించారు. ఫామ్‌తో తంటాలు పడుతున్న విరాట్ కోహ్లీని ఈ పర్యటన కోసం ఎంపిక చేస్తారని గతంలో జరిగిన ప్రచారంలో నిజం లేదని స్పష్టమైంది. సెలక్టర్లు కోహ్లీని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో విరాట్ మళ్లీ ఆసియా కప్‌తోనే రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఆగస్టు 18, 20, 22 తేదీల్లో జింబాబ్వేతో టీమిండియా యువజట్టు మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇటీవల వెస్టిండీస్ సిరీస్‌లో ఆకట్టుకున్న శిఖర్ ధావన్ మరోసారి భారతజట్టును నడిపించనున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత ఆల్‌రౌండర్ దీపక్ చాహర్‌తో పాటు మరో స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఐపీఎల్ 2022 సీజన్‌కు ముందు గాయపడ్డ దీపక్ చాహర్ చాన్నాళ్ల తర్వాత తిరిగి మైదానంలోకి బరిలోకి దిగుతున్నాడు. అటు కౌంటీ క్రికెట్‌లో సత్తా చాటుతున్న వాషింగ్టన్ సుందర్ సైతం చాలా రోజుల మళ్లీ జట్టులో అవకాశం దక్కించుకున్నాడు. కాగా జింబాబ్వే పర్యటన ముగిసిన తర్వాత యూఏఈ వేదికగా ఆసియాకప్ మొదలు కానుంది.
Also Read
- Smriti Mandhana: మిథాలీ రాజ్‌ను పక్కకు నెట్టిన స్మృతి.. ఆసియా కప్‌లో సరికొత్త చరిత్ర..
- Prabhsimran Singh: టీమిండియాలో దక్కని చోటు.. మూడు రోజుల్లో రెండు సెంచరీలతో వీరవిహారం..
- Mohsin Naqvi: ‘భారత్ పసికూన ఐర్లాండ్ చేతిలో ఓడిపోలేదా..? పాకిస్థాన్‌పై మీ విమర్శలు ఎందుకు..’?
- Asia Cup 2026: ఆసియా కప్‌లో జోరుమీదున్న భారత్.. నేడు హాంకాంగ్‌తో మ్యాచ్.. తుది జట్టు ఇదే..
Read Also:Sprite Cool Drink: రంగు మార్చిన ‘స్ర్పైట్’.. 60 ఏళ్ల తర్వాత తొలిసారి..!!
భారత జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!