ఎస్వీ గోశాల వివాదం టెంపుల్ సిటీలో పొలిటికల్ హీట్ పెంచింది... అసత్య ప్రచారం చేసిన వైఎస్ జగన్ రేపు ఉదయం ఎస్వీ గోశాలకు రావాలి.. వచ్చి అక్కడి పరిస్థితి నేరుగా చూడవచ్చు అంటూ తెలుగుదేశం పార్టీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సవాల్ విసిరింది... అయితే టీడీపీ సవాల్ కు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు.. రేపు ఉదయం 10 గంటలకు గోశాలలో కలుద్దాం అంటూ ప్రకటన విడుదల చేశారు..
ఇది విశాఖ విమాన ప్రయాణీకుల దుస్థితి.. "ఆంధ్రా to ఆంధ్రా via తెలంగాణ.." అంటూ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ చేసిన ట్వీట్ విపక్షాల చేతికి ఆయుధం ఇచ్చినట్టు అయ్యింది.. అయితే, గంటా వ్యవహారంపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది.. విమాన సర్వీసులు జాప్యంపై మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ట్వీట్ పై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఏదైనా ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలి.. లేకపోతే విమానయాన శాఖ మంత్రి కూడా మనవారే…
Minister Narayana: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై అనవసరంగా అపోహలు సృష్టిస్తున్నారు అని మంత్రి నారాయణ అన్నారు. అమరావతిపై లాంగ్ విజన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు అని పేర్కొన్నారు.
జగన్ కూడా అరెస్ట్ అయ్యే జైలుకు వెళ్లాడు కానీ కాకాణి మాత్రం దొరకడం లేదన్నారు. పోలీసులు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు.. అతడు విదేశాలకు పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు కూడా ఇచ్చారు.. దోపిడీలు దొంగతనాలు తప్పుడు కేసులు పెట్టించడంలో కాకాణి నెంబర్ వన్ అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు.
AP Cabinet: ఈ రోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం కానుంది. అమరావతి రాజధాని నిర్మాణంలో ఫేజ్- 2 భూ సేకరణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
రాజధానిని స్మశానం అన్నారు.. ఈ రోజు స్వేచ్చా వాతావరణంలో మాట్లాడుకుంటున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 2019 నుంచి 2024 వరకూ భయంకరమైన వాతావరణం ఉంది.. నా జీవితంలో అలాంటిది ఎప్పుడూ చూడలేదు.. నేనుకూడా బయటకు రాలేని పరిస్థితి ఉండేదన్నారు.. హెలికాప్టర్ లో వస్తే కింద ఉన్న చెట్లను నరికేశారు.