Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Top Headlines 9pm 20 02 2026

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Published Date :February 20, 2026 , 9:13 pm
By Gogikar Sai Krishna
  • మన చరిత్ర, సంస్కృతికి చిహ్నంగా అమరావతి స్టేట్ సెంట్రల్ లైబ్రరీ
  • డిజిటల్ గవర్నెన్స్ లో రోల్ మోడల్ గా తెలంగాణ
  • కల్తీ నెయ్యి వ్యవహారం కీలక పరిణామం.. ఏకసభ్య కమిటీ నియామకం..
  • "లవ్ జిహాద్" పెళ్లిళ్ల నేపథ్యంలో గుజరాత్ కీలక చర్యలు..
Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

“రెండు ఛాన్స్‌లు ఇచ్చాం.. కానీ”.. పాక్ మాజీ ప్రధాని విడుదలపై బాంబు పేల్చిన ప్రభుత్వం..

పాకిస్థాన్ మాజీ ప్రధాని జైలు జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన ఆరోగ్యంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో ప్రధాని షెహబాజ్ షరీఫ్ సన్నిహితుడైన రాణా కొత్త విషయాన్ని వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం రెండు సార్లు “సీరియస్ డీల్” ప్రయత్నాలు జరిగాయని రాణా సనౌల్లా వెల్లడించడంతో రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. రాణా సనౌల్లా వివరాల ప్రకారం.. 2024 నవంబర్ 26కు ముందు జైల్లో ఉన్న మాజీ ప్రధానితో చర్చలు జరిపారు. అప్పటి ఇంటీరియర్ మంత్రి మొహ్సిన్ నఖ్వీ, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ముఖ్యమంత్రి అలి అమిన్ గండాపూర్ ఇమ్రాన్‌ను కలిసి ఈ చర్చలు జరిపారని తెలిపారు. తరువాత విదేశాల్లో ఉన్న కొంత మంది వ్యక్తులు మధ్యవర్తిత్వం చేసేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఈ డీల్‌కు మొదట ఇమ్రాన్ ఖాన్ అంగీకరించినా.. చివరికి వెనక్కి తగ్గారని వ్యాఖ్యానించారు. ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలనే దృక్పతంతో ప్రభుత్వం ఉందని.. కానీ ఇమ్రాన్ ఖాన్ మాత్రం ప్రస్తుత ప్రభుత్వాన్ని దింపేసి తానే అధికారంలోకి రావాలనే సంకల్పంతో ఉన్నారని సనౌల్లా వెల్లడించారు.

అయోధ్య ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చిన ‘‘రామ మందిరం’’.. గణాంకాలు చూడండి..

దేవాలయాల గురించి పూర్తిగా తెలియని కొందరు, మేమే తెలివైన వాళ్లమని మాట్లాడుతూ.. గుడులను కడితే డబ్బులు వృధా, దేవాలయాల వల్ల ఏం జరుగుతుంది.? అని ప్రశ్నిస్తుంటారు. అలాంటి వారికి అయోధ్యలోని రామ మందిరమే సమాధానంగా నిలుస్తుంది. ఒక దేవాలయం ఎంత ఆర్థిక మార్పును తీసుకువస్తుందో, ఆ ప్రాంత ఆర్థిక ముఖచిత్రాన్ని ఎలా మారుస్తుందనే దానికి రామ మందిరం సాక్ష్యంగా నిలుస్తోంది. టెంపులు టూరిజం వల్ల ప్రజల వ్యాపారాలు పెరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. తాజాగా ఇండియాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెనేజ్మెంట్ లక్నో(IIM-L) విడుదల చేసిన తాజా అధ్యయనం ప్రకారం, రామ మందిర నిర్మాణం తర్వాత అయోధ్య, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో గణనీయమైన ఆర్థిక మార్పులు చోటుచేసుకున్నాయి. ‘‘ ది ఎకనామిక్ రెనైసాన్స్ ఆఫ్ అయోధ్య: ఏ కేస్ స్టడీ ఆన్ రామ్ మందిర్’’ పేరుతో రిపోర్ట్‌ను విడుదల చేసింది. రామ మందిర నిర్మాణం తర్వాత ఈ ప్రాంతానికి పర్యటాకుల తాకిడి పెరిగిందని చెప్పింది.

గిన్నెలు తోమిన పాకిస్థాన్ జట్టు..? బోర్డు ప్రతిష్ట దెబ్బతీశారంటూ కెప్టెన్‌పై కఠిన చర్యలు!

ఆట ఏదైనా పాకిస్థాన్ టీమ్‌లు గమ్మత్తుగానే ఉంటాయి. ఆ దేశ కెప్టెన్సీలతోపాటు ఆ టీమ్‌లు, కోచ్‌లు తీసుకున్న నిర్ణయాలు ఇలా అన్నీ విచిత్రంగానే ఉంటాయి. తాజాగా మరో విచిత్రమైన వార్త వెలుగులోకి వచ్చింది. పాక్ టీమ్‌ల వివాదాలు అంటే ఎక్కువగా పాక్ క్రికెట్ టీమ్‌లు గుర్తుకు వస్తాయి. కానీ.. పాకిస్థాన్ హాకీ జట్టులో వివాదం తలెత్తింది.. పాకిస్థాన్ హాకీ జట్టు కెప్టెన్ అమ్మాద్ షకీల్ బట్‌పై ఆరోపణలు వచ్చాయి. దీంతో పాకిస్థాన్ హాకీ సమాఖ్య అతనిపై రెండు సంవత్సరాల నిషేధం విధించింది. ఒకవైపు విదేశీ పర్యటనలో వరుస పరాజయాలు, మరోవైపు ఆటగాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

సాక్ష్యాలను తగలబెట్టేశారు.. హీరోయిన్ ప్రత్యూష తల్లి సంచలన కామెంట్స్

సంచలనం సృష్టించిన హీరోయిన్ ప్రత్యూష కేసులో దర్యాప్తు తీరుపై ఆమె తల్లి సరోజిని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసులో అత్యంత కీలకమైన సాక్ష్యాలను అధికారులే స్వయంగా ధ్వంసం చేశారని ఆమె ఆరోపించారు. మెడికో లీగల్ కేసుల్లో పాటించాల్సిన కనీస నిబంధనలను విస్మరించి, నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఘటన జరిగిన సమయంలో బాధితురాలి శరీరంపై ఉన్న దుస్తులు కేసులో అత్యంత కీలకమని, వాటిని ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపకుండా డస్ట్ బిన్‌లో వేసి తగలబెట్టడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని సరోజిని ఆవేదన వ్యక్తం చేశారు. “మెడికో లీగల్ నిబంధనల ప్రకారం బాధితురాలి దుస్తులను ప్యాక్ చేసి భద్రపరచాలి. కానీ ఇక్కడ సాక్ష్యాలు దొరకకుండా కాల్చివేశారు. దుస్తుల్లోనే అసలైన ఆధారాలు ఉంటాయి. ఇప్పుడు నాకు న్యాయం ఎలా జరుగుతుంది?” అని ఆమె ప్రశ్నించారు. ముఖ్యమైన ఎవిడెన్స్‌ను నాశనం చేసిన తర్వాత అసలు నిజాలు ఎలా బయటకు వస్తాయని అధికారులను నిలదీశారు. హత్య లేదా అత్యాచారం జరిగిందని నిరూపించడానికి కావాల్సిన ప్రాథమిక సాక్ష్యాలను మాయం చేసి, పోస్ట్‌మార్టం రిపోర్టులో ఏదో ఒక సాకును చూపి కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఈ విషయంలో తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.

22ఏ జాబితా నుండి భూముల తొలగింపు.. మంత్రి అనగాని కీలక వ్యాఖ్యలు..

22ఏ నిషేధిత భూముల జాబితా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని వెల్లడించారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ బడ్జెట్ కేటాయింపులపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని కీలక ప్రకటనలు చేశారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల 22ఏ జాబితాలో అనేక భూములు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. 22ఏ జాబితా నుంచి భూములను తొలగించే ప్రక్రియను మరింత సరళతరం చేయడానికి అధికారాల బదలాయింపు చేపట్టినట్లు చెప్పారు. ప్రైవేట్ భూములను 22ఏ జాబితా నుంచి తొలగించే అధికారాన్ని ఆర్డీవోలకు అప్పగిస్తున్నట్లు వెల్లడించారు మంత్రి అనగాని… ఇకపై ఏదైనా భూమిని 22ఏ జాబితాలో చేర్చాలంటే సంబంధిత పట్టాదారునికి రిజిస్టర్డ్ పోస్టు ద్వారా లేదా ఈ-కేవైసీ విధానంలో నోటీసు ఇవ్వడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. అనంతరం సమగ్ర విచారణ జరిపి, సరైన కారణాలతోనే ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. ఇక, పదేళ్లకు పూర్వం అసైన్ చేసిన ఇంటి స్థలాలకు పూర్తి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ప్రకటించారు. అలాగే ఇనాం భూముల సమస్యపై నియమిత జీవోఎం త్వరలో సమగ్ర పరిష్కారం సూచించనుందని చెప్పారు.

కల్తీ నెయ్యి వ్యవహారం కీలక పరిణామం.. ఏకసభ్య కమిటీ నియామకం..

తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై సమగ్ర విచారణ కోసం ఏక సభ్య కమిటీని నియమించింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్‌ కుమార్‌ ను విచారణ కమిషనర్‌గా నియమించారు. ఆయన ఆధ్వర్యంలో వన్‌ మెన్‌ కమిటీ ఈ వ్యవహారంపై లోతైన అధ్యయనం చేపట్టనుంది. తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యి నాణ్యత, సరఫరా ప్రక్రియ, టెండర్ విధానం, అలాగే జరిగిన లోటుపాట్లపై కమిటీ సమగ్రంగా పరిశీలించనుంది. ముఖ్యంగా టెండర్ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు జరిగాయా..? నాణ్యత తనిఖీలలో ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగిందా..? అనే అంశాలను ప్రత్యేకంగా అధ్యయనం చేయనుంది. ఇక, ప్రభుత్వం కమిటీకి 45 రోజుల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశముంది. తిరుమల లడ్డూ ప్రపంచవ్యాప్తంగా భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన నేపథ్యంలో ఈ వ్యవహారం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. పారదర్శక విచారణ ద్వారా వాస్తవాలు వెలుగులోకి రావాలని భక్తులు ఆశిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు కొనసాగుతోన్న తరుణంలో.. తాజా పరిణామం ఆసక్తికరంగా మారింది..

“లవ్ జిహాద్” పెళ్లిళ్ల నేపథ్యంలో గుజరాత్ కీలక చర్యలు..

ప్రేమ ముసుగులో కొందరు మతమార్పిడికి పాల్పడుతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. పెళ్లికి ముందు వరకు ప్రేమగా నటిస్తూ, పెళ్లి తర్వాత మతం మారాలని ఒత్తిడి తెస్తున్నారు. దీనిని బీజేపీ, ఇతర హిందూ సంస్థలు ‘‘లవ్ జిహాద్’’గా పేర్కొంటున్నాయి. ఇలాంటి మోసపూరిత వివాహాలకు అడ్డుకట్ట వేయడానికి గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పారిపోయి వచ్చిన జంటలకు రిజిస్ట్రేషన్ వివాహాలకు సంబంధించి మార్పల్ని ప్రకటించింది. రాష్ట్ర అసెంబ్లీలో హోం మంత్రి హర్ష్ సంఘవి మాట్లాడుతూ.. ఇలాంటి వివాహాల నమోదు నియమాలు ఇకపై కఠినతరం చేస్తున్నట్లు ప్రకటించారు. వివాహాల పవిత్రతను కపాడటానికి చట్టాలలో కొన్ని మార్పులు చేయాలని రాష్ట్రంలోని పలు సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.

తాడిపత్రిలో జన్మించిన ప్రతి ఒక్కరూ పుణ్యాత్ములు.. జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఎప్పుడూ వార్తల్లో ఉంటారు.. తాజాగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు జేసీ.. తాడిపత్రిలో జన్మించిన ప్రతి ఒక్కరూ పుణ్యాత్ములు అని పేర్కొన్నారు జేసీ.. “తాడిపత్రిలో తినడానికి మూడు పూటలా అన్నం దొరుకుతుంది. ఈ భూమి ఎంతో శక్తివంతమైనది. చరిత్రలో శ్రీ కృష్ణదేవరాయలు తాడిపత్రిలో ఆలయాలు నిర్మించడానికి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు..” అని వెల్లడించారు.. ఇక, తాడిపత్రి భూమి మీద ఉన్న శక్తిని చాటుతూ, “ఇక్కడ సూర్యశక్తి (సోలార్) ప్రాజెక్ట్‌ను రెండు నెలల్లో పూర్తిచేస్తాము. ఈ ప్రాజెక్ట్ ద్వారా మున్సిపాలిటీకి నెలకు 20 లక్షల ఆదాయం వస్తుంది,” అని జేసీ ప్రభాకర్ రెడ్డి వివరించారు. మరోవైపు.. నా శత్రువు కూడా నా గురించి ఆలోచించి మాట్లాడే విధంగా చేసుకోవడం నా కోరిక.. ఎక్కడైనా, తాడిపత్రిలో బ్రతకలేని వ్యక్తి దేశంలో ఎక్కడ బ్రతకలేడు, అని ఆయన తమ పట్టణం గురించి గొప్పగా చెప్పుకొచ్చారు.. జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి చరిత్ర, ప్రస్తుత పరిస్థితులు మరియు భవిష్యత్తు అభివృద్ధిపై గౌరవంతో మాట్లాడారు. ఆయన మున్సిపాలిటీకి సౌరశక్తి ఆధారిత ప్రాజెక్టు ద్వారా ఆదాయాన్ని పెంచడంపై దృష్టి సారించామని తెలిపారు..

మన చరిత్ర, సంస్కృతికి చిహ్నంగా అమరావతి స్టేట్ సెంట్రల్ లైబ్రరీ

ప్రజా రాజధాని అమరావతిలో నిర్మించబోయే స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఆంధప్రదేశ్ చరిత్ర, సంస్కృతికి చిహ్నంగా ఉండాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అమరావతిలో త్వరలో నిర్మించబోయే స్టేట్ సెంట్రల్ లైబ్రరీ భవన నమూనాను మంత్రి పరిశీలించారు. సెంట్రల్ లైబ్రరీకి సంబంధించి నిపుణులు రూపొందించిన వీడియోను వీక్షించారు. పలు సూచనలు చేశారు. ప్రమాణాలతో, ఆధునిక సాంకేతిక వసతులతో జ్ఞాన కేంద్రంగా సెంట్రల్ లైబ్రరీని తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని లోకేష్ ఆదేశించారు. మన ఘన చరిత్ర, వారసత్వానికి చిహ్నంగా నిలవాలి. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలను ప్రతిబింబించేలా సెంట్రల్ లైబ్రరీ ఉండాలన్నారు.. ఆర్కైవ్స్, ఆడిటోరియం వసతులతో పాటు 15 లక్షలకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉండేలా చూడాలని.. జ్ఞాన కేంద్రంగానే కాకుండా విద్యార్థుల సమగ్ర వికాసానికి దోహదపడాలి. అన్ని వర్గాల ప్రజలు సెంట్రల్ లైబ్రరీతో అనుసంధానం కావాలన్నారు మంత్రి లోకేష్.. ఇందుకు సంబంధించి మొత్తం ఎకోసిస్టమ్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు…

డిజిటల్ గవర్నెన్స్ లో రోల్ మోడల్ గా తెలంగాణ

ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, బ్లాక్ చెయిన్ లాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ను సామాన్యుడికి చేరువ చేసి… డిజిటల్ గవర్నెన్స్ లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తీర్చి దిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్య సాధనలో టెక్నాలజీని కేవలం ఓ సాఫ్ట్ వేర్ గా మాత్రమే కాకుండా… ఓ ట్రాన్స్ ఫార్మేషన్ టూల్ గా మార్చుకుంటున్నామన్నారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ప్రణాళికలను న్యూఢిల్లీ భారత్ మండపంలో ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో భాగంగా శుక్రవారం ‘ఏజెంట్స్ ఆఫ్ ఛేంజ్..ఏఐ ఫర్ గవర్నమెంట్ సర్వీసెస్ అండ్ క్లైమేట్ రెసిలియెన్స్’ అంశంపై నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm chandrababu
  • CM Revanth Reddy
  • Duddilla Sridhar Babu
  • telugu news
  • Top Headlines 9pm

తాజావార్తలు

  • Amit Shah: “నక్సలిజం”చరిత్రను తవ్వి బయటపెట్టిన అమిత్ షా.. ఆ 90 నిమిషాలు దద్దరిల్లిన పార్లమెంట్!

  • Devipatnam-Tiger: దేవీపట్నం ఏజెన్సీలో పులి సంచారం.. గిరిజనుల్లో భయాందోళన!

  • Thaai Kizhavi : ఓటీటీలోకి రాధిక బ్లాక్‌బస్టర్.. ‘థాయ్ కిళవి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

  • Jadeja Kisses CSK Logo: ఇది కదా కావాల్సింది.. CSK లోగోను ముద్దాడిన జడేజా..!

  • Opinion Polls Survey: బెంగాల్‌పై తాజా సర్వే వచ్చేసింది.. ఈసారి గెలవబోయేది ఎవరంటే..!

ట్రెండింగ్‌

  • Sanju Samson-CSK: అయ్యో పాపం.. సంజు ఖాతాలో చెత్త రికార్డు, సీఎస్‌కే కలిసి రాలేదా?

  • Ravindra Jadeja: పింక్ కలర్ నాకు బాగా సూట్ అయింది.. దూబేను అలా బుట్టలో వేశా!

  • MS Dhoni Invests: ఆ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టిన “మిస్టర్ కూల్”.. బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా..!

  • Anand Mahindra: 1000 ఏళ్ల నాటి మెట్ల బావి.. టెక్నాలజీకి ఫిదా అయిపోయిన ఆనంద్ మహీంద్రా..

  • Ragi Boorelu Recipe : పిల్లలకి కూడా నచ్చే హెల్తీ స్వీట్.. రుచికరమైన రాగి పూర్ణం బూరెలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions