హోం మంత్రి అనిత మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా బాణాసంచా తయారీ కేంద్రాలులో సేఫ్టీ ఆడిట్ చేయించాలని ప్రభుత్వం నిర్ణయం అన్నారు. ఎల్జీ పాలిమర్ ప్రమాదంలో మృతులకు కోటి రూపాయలు ప్రకటించిన గత ప్రభుత్వం ఇప్పటి వరకు పరిహారం అందజేయలేదన్నారు.
మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం అంబేడ్కర్ ను తాకట్టు పెట్టింది అని ఆరోపించారు. లూలూ కంపెనీకి స్వరాజ్య మైదాన్ ను తాకట్టు పెట్టాలని చూసారు.. ఎందుకు అంబేడ్కర్ స్మృతి వనాన్ని పీపీపీ మోడల్ లో ప్రైవేటు పరం చేస్తున్నారు అని ప్రశ్నించారు.
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ( ఏప్రిల్ 14న ) గుంటూరు జిల్లాలోని తాడికొండ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రజా సమస్యలపై ప్రధానంగా చర్చిస్తారు.
విశాఖ గ్రేటర్ మేయర్ పీఠంపై కూటమి ప్రభుత్వం పట్టుబిగిస్తోంది.. మ్యాజిక్ ఫిగర్ చుట్టూ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేనలోకి 74వ వార్డు కార్పొరేటర్ వంశీరెడ్డి చేరనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాలను కలిసి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అధికార పార్టీకి అగ్ని పరీక్షగా మారింది అవిశ్వాసం ఓటింగ్. మేయర్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 74 మ్యాజిక్ ఫిగరు చేరాలి. ఇప్పటికకే కూటమికి 70 మంది కార్పొరేటర్ల బలం…
ఏపీ ముఖ్యమంత్రి చాలా క్లోజ్…అదే ఆయనకు రెండోసారి మంత్రయ్యేలా చేసింది. రాష్ట్ర మంత్రి అయినప్పటికీ…నియోజవర్గానికి మాత్రమే పరిమితం అయ్యారా ? జిల్లా ఎమ్మెల్యేలంటే…ఆ సీనియర్ మంత్రి భయపడుతున్నారా ? ఇంతకీ ఎవరా మంత్రి…? ఎంటా నియోజకవర్గం ? పొంగూరు నారాయణ…విద్యావేత్తగా దేశంలో ఎంతో ప్రసిద్ధి. 2014లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఆయనకు…ఎమ్మెల్సీ పదవి ఇచ్చి….మంత్రిని చేశారు సీఎం చంద్రబాబు. కీలకమైన పురపాలక..పట్టణాభివృద్ధి శాఖల బాధ్యతలను అప్పగించారు. 2014 నుంచి 19 వరకూ మంత్రిగా పని చేశారు. ఆ…
వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల టీడీపీ-జనసేనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గత కొన్ని నెలలుగా ఈ రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు సోషల్ మీడియాలో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, మహిళలను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. మహిళల పట్ల గౌరవం ఉందని చెప్పే వారే, వారికి ఇచ్చిన హామీలను వదిలేసినప్పుడే వారి నిజమైన స్వభావం బయటపడిందని మండిపడ్డారు. రాజ్యంలో పోలీస్ వ్యవస్థ ‘రెడ్ బుక్ రాజ్యాంగం’లో మునిగిపోతోందని, మాజీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు కూడా రక్షణ…
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) మేయర్ అవిశ్వాస పరీక్షకు సమయం దగ్గర పడుతోన్న వేళ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీ రెడ్డి.. తెలుగుదేశం పార్టీ కండువా కప్పేసుకోవడానికి సిద్ధం అయ్యారు. గాజువాక ప్రాంతానికి చెందిన వంశీ.. వైసీపీకి గుడ్‌బై చెప్పి.. పార్టీ మారడం ఆసక్తికర పరిణామం.
అధికారంలోకి రావటానికి అప్పట్లో ఏమేమి ఎర వేశారో అందరికీ తెలుసు.. కానీ, ఎన్టీఆర్ లా అభిమన్యుడు కాదు జగన్.. అర్జునుడిలా మీ కుట్రలు ఛేదిస్తారని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి పేర్ని నాని.. జైల్లో ఉన్న సమయంలో డ్రామాలు ఆడింది చంద్రబాబు.. జైల్లోకి వెళ్లగానే డీ హైడ్రేషన్.. అలర్జీ అన్నారు..
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పై అవిశ్వాసం తీర్మానం చుట్టూ రాజకీయం రసకందాయంలో పడింది. అవిశ్వాసం నెగ్గితే మేయర్, డిప్యూటీ మేయర్ పంపకాలపై కూటమిలో ఏకాభిప్రాయం కుదరడం లేదు. డిప్యూటీ మేయర్ పై క్లారిటీ రాకుండా క్యాంప్ రాజకీయాలకు వెళ్లలేమని జనసేనలో సగం మంది కార్పొరేటర్లు తేల్చేశారు.
రాష్ట్ర ఎక్సైజ్, గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్రకు ఓఎస్డీగా ఉన్న పి.రాజబాబును ఆ పోస్టు నుంచి ప్రభుత్వం తొలగించింది. గనులశాఖపై ఆరోపణల నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వం రాజాబాబును ప్రభుత్వం పక్కన పెట్టింది. గత కొన్ని రోజులుగా రాజాబాబు ఆఫీసుకు కూడా హాజరుకావడం లేదు. ఓఎస్డీ పోస్టు నుంచి తప్పుకుంటానని ఆయన పేషీలో చెప్పినట్లు తెలిసింది. మరోవైపు కొంతమంది మంత్రుల ఓఎస్డీలపై తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పేర్కొంది. ఈ…