వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా అధికారంలోకి రావాలంటే... యుగాంతం అయిపోవాలి అంటూ ఎద్దేవా చేశారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి.. విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పోలీసులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు.. ఓ మాజీ సీఎం.. పోలీసుల బట్టలు ఊడదీస్తాననడం ఎంతవరకు కరెక్ట్? అని నిలదీశారు.
రామగిరి మండలంలో వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం క్లియర్ గా కనిపించిందని వ్యాఖ్యానించారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్.. హెలికాప్టర్ను ఇబ్బందులకు గురిచేసి.. మార్గమధ్యలో జగన్పై భౌతిక దాడి చేయాలనే కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. దేశంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత.. ఇంటెలిజెన్స్ సంస్థల రిపోర్టుల ప్రకారం అత్యధిక థ్రెట్ ఉన్న నేత కూడా జగనే అన్నారు.
Ambati Rambabu : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల లింగమయ్య హత్య అనంతర పరిణామాలపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ పై “రౌడీ”, “సైకో” అంటూ టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్న తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. “వీళ్ళు వీళ్ళ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా?” అంటూ ప్రశ్నించిన అంబటి, చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని, ఆయనకే “చీటర్” బిరుదు…
మాజీ సీఎం గనుక వైఎస్ జగన్కు భద్రత ఇచ్చాం.. ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యే.. వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ మాత్రమే ఆయనకు వర్తిస్తుందన్నారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత..
పార్టీలో లోకేష్కి కీలక బాధ్యతలు ఇవ్వాలంటున్నారు.. టీడీపీకి లోకేష్ నాయకత్వం అవసరం అన్నారు వర్మ.. పార్టీకి 2047 ప్రణాళిక కావాలని అభిప్రాయపడ్డారు.. అయితే, పార్టీ రథసారథిగా నారా లోకేష్ ను నియమించేలా.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవాలని కోరారు. అంతేకాదు. లోకేష్ నిర్వహించిన యువ గళం పాదయాత్ర వల్లనే పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు వర్మ..
నిన్నటి జగన్ టూర్ డ్రామాను తలపించింది.. ఏదో రకంగా శవ రాజకీయాలు చేయాలని చూస్తున్నారు అంటూ మండిపడ్డారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆమె.. వైసీపీ హయాంలో ఐపీసీ సెక్షన్ ప్రకారం కాకుండా వైసీపీ సెక్షన్ ప్రకారం పోలీసులు వ్యవహరించారని విమర్శించారు.. ఇక, జగన్ పర్యటన కోసం 1100 మంది పోలీసులను పెట్టాం.. జగన్ వెళ్లే ప్రాంతం చాలా సెన్సిటివ్ ఏరియా.. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నాం..
CM Chandrababu: కాసేపట్లో అమరావతి రాజధాని ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఇంటికి శంకుస్థాపన జరగనుంది. ఇవాళ (ఏప్రిల్ 9న) ఉదయం 8.51 గంటలకు భూమి పూజ చేయనున్నారు.
Srinivasa Reddy: వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తాజాగా అమరావతిలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి ప్రజా ఆరోగ్య వ్యవస్థను గాడిలో పెట్టారని, గ్రామస్థాయికి ప్రభుత్వ వైద్యాన్ని తీసుకెళ్లిన ఘనత ఆయనదని పేర్కొన్నారు. విలేజ్ క్లినిక్ ల ద్వారా గ్రామస్థాయికి ప్రభుత్వ వైద్యం అందించారని.. మండలానికి రెండు పీహెచ్సిలు ఉండాలనే ఆలోచనతో 80 కొత్త పీహెచ్సీలు ఏర్పాటు చేసారని తెలిపారు. అలాగే రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలను పటిష్టం చేశారని,…
వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన.. ఇప్పుడు రాప్తాడు నియోజకవర్గంలో కాకరేపుతోంది.. ఇటీవల దారుణ హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు శ్రీసత్యసాయి జిల్లాకు వెళ్లారు జగన్.. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలోని పాపిరెడ్డిపల్లిలో గత నెల 30వ తేదీన వైసీపీ నేత కురుబ లింగమయ్య కుటుంబంపై దాడి చేశారు..