Bhuma Akhila Priya: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు.. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ.. మాకు తెలియకుండా ఎవరైనా పదవులు తెచ్చుకుంటే వారిని నియోజకవర్గంలో కూడా అడుగుపెట్టనివ్వం అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.. పదవులు ఇవ్వాలనుకుంటే మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి మాత్రమే ఇవ్వండి అని సూచించారు.. లేకపోతే అసలు పని చేయని వాళ్లకి పదవులు ఇస్తే అది కరెక్ట్ కాదు అని హితవుచెప్పారు.. ఈ విషయం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు వెల్లడించారు.. పార్టీ కోసం, భూమా కుటుంబం కోసం పనిచేసిన వారికి తప్పకుండా పదవులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ.. అయితే, వైసీపీ ప్రభుత్వ హయాంలోనే కాదు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విపక్షాలతో పాటు.. కొందరు సొంత పార్టీ నేతలను కూడా టార్గెట్ చేస్తూ భూమా అఖిల ప్రియ పలు సందర్భాల్లో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.. అయితే, ఇప్పుడు మినీ మహానాడు వేదికగానే.. అది కూడా పార్టీ నేతలపై భూమా అఖిలప్రియ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆళ్లగడ్డ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది..
Read Also: OTT ట్రెండింగ్‌లో అనగనగా.. కంటెంట్‌తో మెప్పించిన సుమంత్..!
మరోవైపు, మన దేశ సైనికులకు సంఘీభావంగా ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నేతృత్వంలో తిరంగా ర్యాలీ నిర్వహించిన విషయం విదితమే.. ఈ సందర్బంగా పాకిస్తాన్ యుద్ధంలో అమరవీరుడైన తెలుగు జవాన్ మురళీ నాయక్‌కు అఖిల ప్రియ నివాళులు అర్పించారు. చాలా రోజుల తర్వాత జాతీయ జెండాను పట్టుకున్నానని ఎమ్మెల్యే చెప్పారు. ఎమ్మెల్యే అఖిల ప్రియ తన ఐదు నెలల జీతాన్ని ఆర్మీకి విరాళంగా ప్రకటించిన విషయం విదితమే.. ఇక, టీడీపీ మినీ మహానాడులో ఎమ్మెల్యే అఖిల ప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వర్కులను చేసుకొని 60 శాతం, 40 శాతం కమిషన్లు తీసుకుందామంటూ వైసీపీ నాయకులు రాయబారం పంపారని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈరోజు గెలిచామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో లాగా కాకుండా.. ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తాం అని హామీ ఇచ్చారు. ఈ గెలుపు తనది కాదని, ప్రజల గెలుపు అని ఎమ్మెల్యే అఖిల ప్రియ చెప్పుకొచ్చిన విషయం విదితమే..