TDP Mahanadu: కడప నగరంలోని పబ్బాపురం దగ్గర నిర్వహించనున్న తెలుగు దేశం పార్టీ (టీడీపీ) మహానాడు ఏర్పాట్లపై మంత్రుల బృందం సమీక్షా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా మహానాడు నిర్వహణ కమిటీలతో మంత్రుల బృందం ప్రత్యేకంగా సమావేశమైంది. సభా ప్రాంగణాన్ని ఎలా ఏర్పాటు చేయాలి, వీఐపీల భద్రత, ఆహారం, తాగునీరు, వసతులపై ప్రధానంగా సమీక్షించారు.
Read Also: YS Jagan: తిరుపతిలో దళిత విద్యార్థిపై దాడి.. అధికార పార్టీ డైరెక్షన్‌లో కక్షసాధింపు చర్యలు
అలాగే, రాయలసీమ జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ సమక్ష సమావేశానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హోం శాఖ మంత్రి వంగలపూడి అనితతో పాటు కడప జిల్లా ఇంఛార్జ్ మంత్రి సవిత, అనగాని సత్య ప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.