Paritala Sriram: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజవర్గం మినీ మహానాడులో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు అర చెయ్యే ఆయుధం అవుతుందన్నారు.. సమయం మించి పోలేదు.. ఇంకా నాలుగేళ్ల సమయం ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ధర్మవరం నాకు చాలా ఓపిక నేర్పించిందన్న ఆయన.. కానీ, నాలో ఉన్న ఒరిజనల్ అలానే ఉందన్నారు.. పొద్దు మునగాలంటేనే సమయం పడుతుంది.. ఎందుకు మీరు డీలా పడిపోతున్నారు..? అని ప్రశ్నించారు.. మీరు తప్పి చేసినా, ఒప్పు చేసినా మీ వెంటే ఉంటాను.. నా వెంట నడిచిన వచ్చిన వారినెవర్ని మర్చిపోలేదు అంటూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు.. ఎవర్ని చూసో భయపడాల్సిన పని లేదు.. గ్రామాల్లో ధైర్యంగా పనిచేయండి అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.. టీడీపీ సీనియర్ నేత, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్..
Read Also: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
కాగా, గత ఎన్నికల్లో ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని బావించారు పరిటాల శ్రీరామ్.. ఆ నియోజకవర్గంపై కేంద్రీకరించి పనిచేశారు.. అయితే, కూటమి పొత్తుల్లో భాగంగా.. ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు చంద్రబాబు నాయుడు.. దీంతో, ఆ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సత్యకుమార్ యాదవ్.. విజయం సాధించారు.. ఆ తర్వాత చంద్రబాబు కేబినెట్‌లో మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు.. అయితే, ధర్మవరం నియోజకవర్గం మహానాడులో ఇప్పుడు పరిటాల శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి..