ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధించి.. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత.. తెలుగుదేశం పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.. మరో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో.. వైసీపీలో చేరారు టీడీపీ సీనియర్ నేత, గుంటూరు తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎస్.ఎం.జియావుద్దిన్.. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా షేక్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్ఎం జియావుద్దీన్ మాట్లాడుతూ.. చంద్రబాబు మా కుటుంబానికి మాట ఇచ్చి తప్పారని.. మా సోదరుడు లాల్ జాన్ బాష మరణం తర్వాత మాకు అన్యాయం చేశారని విమర్శించారు.. పాదయాత్ర సమయంలో చంద్రబాబు మా కుటుంబానికి అన్యాయం చేశారని వైఎస్ జగన్ చెప్పిన తర్వాతే కంటి తుడుపుగా మైనారిటీ కమిషన్ ఛైర్మన్ పదవి ఇచ్చారని దుయ్యబట్టిన ఆయన.. చంద్రబాబు మైనార్టీ శాఖను కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు.. సీఎం వైఎస్ జగన్ మైనారిటీలకు డిప్యూటీ సీఎంతో సహా అనేక పదవులు ఇచ్చి ఎంతో గౌరవిస్తున్నారని ప్రశంసలు కురపించిన జియావుద్దీన్… అందుకే ముఖ్యమంత్రికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నాను.. వైసీపీలో చేరన్నారు.