అంతా ఊహించనట్టే జరుగుతోంది. విశాఖ తెలుగుదేశంపార్టీకి కార్పొరేటర్ల షాక్ మొదలైంది. వైసీపీ వ్యూహాలను తట్టుకుని నిలబడటం సీనియర్లకు కష్టంగా మారిందట. దీంతో పలువురు కార్పొరేటర్లు అధికారపార్టీకి టచ్‌లో ఉన్నట్టు సమాచారం. 18 లక్షల మందికిపైగా జనాభా.. రూ.4 వేల కోట్ల బడ్జెట్జీవీఎంసీలో ప్రస్తుతం వైసీపీ బలం 59 ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం.. రాష్ట్రంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్. భీమునిపట్టణం, అనకాపల్లి మున్సిపాలిటీల విలీనం తర్వాత గ్రేటర్ విశాఖ పరిధి 98 డివిజన్లకు విస్తరించింది. జనాభా 18లక్షల…
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌కు సవాల్ విసిరారు ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు.. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.. హైరాబాద్‌లో ఉండి ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు, విమర్శలు చేయడం కాదు.. చంద్రబాబుకు సిగ్గుంటే ఇప్పటికైనా రాష్ట్రానికి రావాలని డిమాండ్ చేశారు. ఇక్కడున్న వైద్య సదుపాయాలు పరిశీలిస్తే నీకే తెలుస్తుందని హితవుపలికారు.. నీ హయాంలో వైద్య సౌకర్యాలను ఎంత సంకనాకించేశావో మాకు తెలుసు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి అప్పలరాజు..…
సీఎం వైఎస్ జగన్ అనుకున్నది సాధిస్తారని తెలిపారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. సింహాచలంలో లక్ష్మీ నృసింహ్మ స్వామిని దర్శించుకున్నఆయనకు ఘనంగా స్వాగతం పలికారు ఆలయ ఈవో, అధికారులు, వైదిక వర్గాలు.. ఆ తర్వాత గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. పంచగ్రామాల భూసమస్య అన్నది నేను పుట్టక ముందునుంచే ఉందన్నారు.. వైసీపీ పరిపాలనా రాజధాని విషయంలో ప్రభుత్వం చిత్త శుద్ధితో ఉందన్న ఆయన.. గత ప్రభుత్వం వేసిన అభివృద్ధి…
ఏపీలో టీడీపీ నేతలను కేసులు వెంటాడుతూనే ఉన్నాయి.. తాజాగా టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు మరికొందరు టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు కృష్ణాజిల్లా మైలవరం పోలీసులు.. సెక్షన్ 188 ఐపీసీ, 3 ఈడీఏ కింద కేసు నమోదు చేశారు.. అసలు కేసు ఎందుకు నమోదు చేశారనే విషయానికి వెళ్తే.. టీడీపీ పిలుపు మేరకు ఈ నెల 16వ తేదీన మైలవరంలో ఆందోళన నిర్వహించారు. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి…
ఆంధ్రప్రదేశ్ శాసన సభలో తిరుగులేని మెజార్టీ ఉన్న అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి.. శాసన మండలిలో మాత్రం సరైన బలం లేదు అనేది నిన్నటి మాట.. ఎందుకంటే.. మండలిలో సమీకరణాలు మారుతున్నాయి.. ఇప్పటి వరకు ఆధిక్యంలో ఉన్న ప్రతిపక్ష టీడీపీ బలం.. ఇవాళ్టి నుంచి తగ్గిపోనుంది.. ఇదే సమయంలో.. అధికార వైసీపీ బలం పెరగనుంది.. ఇవాళ మండలి నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్సీలు రిటైర్ కానున్నారు.. అందులో.. ఏడుగురు టీడీపీ సభ్యులు కాగా.. ఒకరు వైసీపీ సభ్యులు..…
కరోనా సమయంలో కనీసం ప్రజలకు అందుబాటులో ఉండని తెలుగుదేశం పార్టీ, బీజేపీ నేతలు.. హైదరాబాద్‌లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టడం హాస్యాస్పదం.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం విడ్డూరం అని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. మరోవైపు.. నారా లోకేష్‌పై సెటైర్లు వేశారు రోజా.. తనలాగే రాష్ట్రంలోని విద్యార్థి, విద్యార్థులు దద్దమ్మల, చవటల తయారవ్వాలననే దురాలోచనతో పరీక్షలు రద్దు చేయాలని లోకేష్ డిమాండ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు… ప్రజలకి వాక్సిన్ అందరికీ…
వైఎస్ఆర్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే.. క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఆంగ్లో ఇండియన్ మాజీ ఎమ్మెల్యే ఫిలిప్ సి. తోచర్… సీఎం చేతుల మీదుగా వైసీపీ కండువా కప్పుకున్నారు.. ఇక, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కత్తెర సురేష్, కత్తెర హెన్రీ క్రిస్టినా పాల్గొన్నారు.. కాగా, ఈ ఏడాది జనవరిలో టీడీపీకి రాజీనామా చేశారు ఫిలిప్ సి. తోచర్… క్రైస్తవ మతం…
టిడిపి, బిజేపిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. టీడీపీ-బీజేపీ నేతలు జత కలిశారా అనే అనుమానం వస్తుందని పేర్కొన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పాత బకాయిలు రూ. 399 కోట్లు ఉన్నాయని… ఈ సీజనుకు సంబంధించి రూ. 1200 కోట్లు ఇంకా కేంద్రం నుంచి బకాయిలు రావాల్సి ఉందన్నారు. ఇక్కడి బీజేపీ నేతలు వాటిని రిలీజ్ చేయించేలా చర్యలు తీసుకుని క్రెడిట్ తీసుకోవచ్చని.. ఎఫ్ఆర్బీఎం చట్టం నిబంధనలను మేము అనుసరిస్తున్నామని…
ఆంధ్రపదేశ్‌లోని కర్నూలు జిల్లాలో పాతకక్షలు భగ్గుమన్నాయి. కర్నూలు జిల్లాలోని గడివేముల మండలంలోని పెసరవాయి గ్రామంలో టీడీపీ నేతలను ప్రత్యర్ధులు నరికి చంపారు. అడ్డొచ్చిన అనుచరులపై కూడా దాడులు చేశారు. పెసరవాయి గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ప్రతాప్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డీలు గురువారం ఉదయం అనుచరులతో కలిసి వెళ్తున్న సమయంలో ప్రత్యర్ధులు దాడి చేశారు. ఈ దాడిలో ప్రతాప్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డీలు అక్కడికక్కడే మరణించగా, ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాపపడిన ముగ్గురిని నంధ్యాల ఆసుపత్రికి తరలించి వైద్యం…
టిడిపిపై ఏపీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. త్వరలోనే రాజధాని తరలింపు ఖాయమని… స్వార్థంతో కూడిన ప్రభుత్వం మాది కాదని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో పోలవరం పూర్తి చేస్తామన్నారు ఏమైనా చేసారా….. పోలవరం ప్రాజెక్టుకు అంకురార్పణ చేసి 24 క్లియరెన్స్ గాను 23 క్లియరెన్స్ పూర్తి చేసి దానికి రూపు రేఖలు తెచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. రఘురామకృష్ణరాజు రాజకీయం కోసం అనేక లేఖలు రాసుకుంటే ఎవరూ నమ్మే…