గుంటూరు జిల్లాలో వైసీపీ-టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. అమరావతి మండలంలోని ఉంగుటూరు గ్రామంలో గల చెరువు మరమ్మతుల విషయంలో వివాదం చెలరేగింది. దీంతో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. సర్పంచ్ భర్త సోమశేఖర్‌పై వైసీపీకి చెందిన రాయపాటి శివ వర్గం కర్రలతో దాడి చేసింది. సోమశేఖర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం ఉంగుటూరులో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
నాకు 750 కోట్లు విలువ చేసే భూములు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు. 49 ఎకరాలు నా ఆధీనంలో ఉందని నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. విజయసాయిరెడ్డి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. నిరూపించ లేకపోతే విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర నుండి వెళ్ళిపోతారా.. పార్టీ మారలేదని కక్షతో చేసారా అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేసాను అని అక్కసుతో వేధిస్తున్నారా. మంత్రి గారు అరెస్టు చేస్తామని…
తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి ఎల్ రమణ త్వరలో రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా మీడియాతో మాట్లాడుతూ… పార్టీ మారడం పై పార్టీ కార్యకర్తలను చర్చించి పూర్తి వివరాలు అందిస్తా అన్నారు. నేను ఎప్పుడూ పదవి కోసం ఆశించలేదు ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పాటుపడుతున్నాం. ఇప్పుడు ఉన్న పరిస్థితిలలో ఓటరు మమ్మల్ని నమ్మి ఓటు వేసిన వారికి మా వంతు కృషి చేస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ వారితో ఎలాంటి చర్చలు జరపలేదు. ఎప్పుడు నేను తెలుగుదేశం…
ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ చంద్రబాబు, లోకేష్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు రాజకీయ ప్రత్యర్థి జగన్ కాదని…చంద్రబాబుకు లోకేష్ శత్రువని ఎద్దేవా చేశారు. లోకేష్ ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ ఎదగదని….మనుషులను వాడుకుని వదిలేయడంలో లోకేష్, చంద్రబాబు సిద్ధహస్తులు అని మండిపడ్డారు. రఘురామ కృష్ణంరాజు లాంటి మా పాత మిత్రులు వారి తత్వాన్ని గమనించాలని పేర్కొన్నారు. డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని పరామర్షించేందుకు విశాఖకు వచ్చిన లోకేష్.. అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడారని ఫైర్ అయ్యారు.…
రెండు సంవత్సరాలలో అని సంక్షేమ పథకాలు అమలు చేశాం. దాదాపు 90 శాతం పూర్తి చేశాం. మిగిలిన 10 శాతం కూడా అమలు చేస్తాం. ప్రజలు నమ్మకం పెట్టుకొని ఓట్లు వేసినందుకు వారికి న్యాయం చేస్తున్నాం అని ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ రెడ్డి అన్నారు. ఎన్నికల మేనిఫెస్టో ను పవిత్ర గ్రంథంగా భావించి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. కరోనాతో తల్లితండ్రులు చనిపోయిన పిల్లలకు 10 లక్షల ఆర్థిక సహాయం ఆదిస్తుంది ప్రభుత్వం. తల్లిదండ్రులలో ఒక్కరూ చనిపోయిన…
సిఎం జగన్ ఢిల్లీ టూర్ పై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఢిల్లీ వెళ్లి 5 గురు కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిని కలిశారని.. అదనపు సహాయం, రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. మంత్రుల దృష్టికి తీసుకుని వెళ్లిన అన్ని అంశాలను మీడియాకు ఎప్పటికప్పుడు వెల్లడించామని.. ఢిల్లీ పర్యటనకు రాజకీయాలకు సంబంధం లేదన్నారు. గతంలో చంద్రబాబు ఢిల్లీకి వెళ్లినప్పుడు చీకటి…
సిఎం జగన్ ఢిల్లీ టూర్ నేపథ్యంలో ఏపీ రాజకీయాలు మళ్ళీ వేడెక్కాయి. కేసుల నుంచి తప్పించుకునేందుకే సిఎం జగన్ జగన్ ఢిల్లీ వెళుతున్నారని టిడిపి విమర్శలు చేసింది. అయితే టిడిపికి తాజాగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ అమోల్ బేబీ అయితే… లోకేష్ హెరిటేజ్ దున్నపోతా? భాష మాకు కూడా వచ్చు అని హెచ్చరించారు మంత్రి అనిల్ కుమార్. నాయకత్వ లక్షణాలు రక్తంలో ఉంటాయి…నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడం కాదన్నారు. దేశ ప్రజలు…
ఏపీ సీఎం వైఎస్ జగన్ హస్తినకు వెళ్లారు.. మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న ఆయన.. పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు.. ఇక, రాత్రికి అక్కడే బస చేసే.. రేపు తిరిగి ఏపీకి రానున్నారు.. ఇదే సమయంలో.. సీఎం ఢిల్లీ పర్యటనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.. ఆ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ.. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి ప్రతిపక్షాలకు అత్యుత్సాహం ఎక్కువ అవుతోందని మండిపడ్డ ఆయన.. సీఎం టూర్ పై వక్రభాష్యాలు చెప్పడం దురదృష్టకరం అన్నారు..…
ఏపీ సర్కార్ పై టిడిపి నేత నారా లోకేష్ మరోసారి ఫైర్ అయ్యారు. అధికారం అండతో వైసీపీ పార్టీ హత్యారాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మలకాపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త గోపాల్ ను వైసీపీ నేతలు పాశవికంగా హత్య చేశారని లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. టిడిపి ప్రభుత్వం హయాంలో రాష్ట్రమంతా అభివృద్ధి-సంక్షేమం కనిపించేదని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. వైసీపీ రెండేళ్ల పాలనలో హత్యలు, దోపిడీలు, అరాచకాలే కనిపిస్తోన్నాయని…
టిడిపి, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు దోచుకోవడం తప్ప వేరే ఎజెండానే లేదని..అందుకే ప్రజలు ఈడ్చి కొట్టారని చురకలు అంటించారు. చంద్రబాబు ఇంకో ఐదేళ్లు అధికారంలో ఉంటే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అయ్యేదన్నారు. “ప్రజలు ఈడ్చి కొట్టారు కాబట్టి సరిపోయింది. బాబు ఇంకో ఐదేళ్లు అధికారంలో ఉంటే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అయ్యేది. ఇసుక మాఫియా, మైనింగ్, నీరు-చెట్టు నిధుల్ని బొక్కే మాఫియా, హెరిటేజ్…