ఢిల్లీకి వెలిగొండ ప్రాజెక్టు లొల్లి.. కేంద్ర జలశక్తి మంత్రితో టీడీపీ నేతల భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెలిగొండ ప్రాజెక్టు విషయంలో.. ఇటు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ నేతలు.. మరోవైపు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.. ఇప్పుడు హస్తినకు కూడా వెళ్లారు.. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ని కలిసింది ప్రకాశం, నెల్లూరు జిల్లాల తెలుగుదేశం పార్టీ శాసనసభ్యలు, మాజీ శాసనసభ్యలు, నాయకుల బృందం.. వెలిగొండ ప్రాజెక్టు అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.. వెలిగొండ ప్రాజెక్టును తక్షణమే అనుమతి పొందిన ప్రాజెక్టుగా కేంద్ర గెజిట్‌లో చేర్పించాలని కేంద్ర మంత్రిని కోరిన టీడీపీ టీమ్.. ప్రకాశం జిల్లా కరువు పరిస్థతిని, జిల్లా నైసర్గిక స్వరూపాన్ని, వెలిగొండ ప్రాజెక్టు ప్రాధాన్యతను సవివరంగా కేంద్రమంత్రికి వివరించింది.. ఢిల్లీ వెళ్లిన టీడీపీ టీమ్‌లో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కొండపి శాసనసభ్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి, పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, ఉదయగిరి (నెల్లూరు) మాజీ శాసనసభ్యలు బొల్లినేని రామారావు, కనిగిరి మాజీ శాసనసభ్యలు డా. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఒంగోలు మాజీ శాసనసభ్యలు దామచర్ల జనార్ధన్, సంతనూతలపాడు మాజీ శాసనసభ్యలు బి.ఎన్. విజయ్ కుమార్, యర్రగొండపాలెం తెదేపా ఇన్‌ఛార్జ్ గూడూరి ఎరిక్సన్ బాబు, ఒంగోలు తెదేపా నాయకుడు దామచర్ల సత్య తదితరులు ఉన్నారు.
Also Read
తాజావార్తలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
-
Stock Market Today: స్టాక్ మార్కెట్‌లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
-
Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
-
Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!