పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై లోకేష్ చేస్తున్న విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయి. లోకేష్ తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు అని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. 2016లో స్పెషల్ ప్యాకేజ్ లో భాగంగా పోలవరం అంచనాలు 20వేల కోట్లకు కుదిస్తే చంద్రబాబు సంతకాలు చేశారు. కానీ సీఎం జగన్ సూచనల మేరకు పోలవరం నిధల కోసం పార్లమెంటు సమావేశాలు స్తంభింపచేశాం. ఇటీవలే పోలవరం సవరించిన అంచనాలు 47వేల కోట్లకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది అని తెలిపారు. టీడీపీ కంటే వైసీపీ ప్రభుత్వంలో పోలవరంకు 27వేల కోట్ల రూపాయలు అదనంగా నిధులు సాధించాం అని స్పష్టం చేసారు. అలాగే ప్రజలకు వాస్తవాలు తెలిసిన లోకేష్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు అని పేర్కొన్నారు.