ఉత్తరాంధ్ర అభివృద్ధిపై అధికార పార్టీకి ఛాలెంజ్ చేస్తున్నాం అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చేన్నాయుడు అన్నారు. ఏ అంశంపైనైనా చర్చకు మేం సిద్ధం….వేదిక ఎక్కడో అధికార పార్టీ నేతలు చెప్పాలి. ఉత్తరాంధ్ర ప్రజల స్రవంతి, వంశధార-బహుద నదుల అనుసంధానం చంద్రబాబు ఆకాంక్ష. కానీ రేండున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వం భ్రష్టుపట్టించింది. ఎస్… బాస్ అనే వ్యక్తులు ఉత్తరాంధ్ర మంత్రులుగా వున్నారు.. అంతేగాని ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లే సత్తా ఉన్న ఒక్కరు మంత్రులుగా లేరు. వంశధార ప్రాజెక్టు వల్ల పార్టీకి నష్టం జరిగింది… కానీ సమాజ హితం కోసం రిస్క్ చేశాము… మిగిలిన 10శాతం పనులను ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదు. అభివృద్ధి చేయలేక ముఖ్యమంత్రి మూడు రాజధానులు అంశం తెరపైకి తెచ్చారు అని పేర్కొన్నారు.