తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు. మతాలపై నమ్మకం ఉండే వారి మనోభావాలను గౌరవించి పాలకులు నడుచుకోవాలని తెలిపారు. ఏ మతానికి సంబంధించిన పండుగులకైనా ఆంక్షలు విధించటం సరైంది కాదు. కోర్టుల ద్వారా అనుమతి తెచ్చుకుని పండుగులు నిర్వహించుకోవటం బాధాకరం. కోర్టు తీర్పును గౌరవించి నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. హైదరాబాద్ పండుగలకు కేంద్రం. గణేష్ చతుర్థి హైదరాబాద్ లో బాగా నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడిగా వినాయక చవితి ఎన్టీఆర్ భవన్లో జరుపుకోవటం ఆనవాయితీ. కులాలకు, మతాలకు అతీతంగా పూజించే దేవుడు వినాయకుడు మాత్రమే. మంచి పనులకు అవరోధనం రాకుండా ఉండాలంటే వినాయకుడిని పూజించాలి అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు.