రాజధాని అమరావతిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 20 జిల్లాల్లో వ్యతిరేకత ఉందని మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ అన్నారు. మూడు అడుగుల గొయ్యి తీస్తే నీరు ఉంటుందని, అలాంటిది 50 అంతస్తుల సచివాలయం కడతా అంటున్నారు? అని విమర్శించారు. జీరో కరప్షన్ అంటున్నారు కానీ.. ప్రతి ఎమ్మార్వో, పోలీస్ స్టేషన్లో డబ్బులు తీసుకుంటున్నారని మండిపడ్డారు. సొంత నియోజకవర్గం కుప్పంలో అత్యాచారాలు, దాడులు, పేదరికం తొలించలేని చంద్రబాబు నాయుడు.. రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేస్తారా? అని ప్రశ్నించారు. ఏపీ ప్రజల్లో…
బుధ, గురు వారాల్లో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులతో లోకేష్ భేటీ కానున్నారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌తో లోకేశ్ భేటీ అవ్వనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఆహార శుద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాసవాన్‌తో సమావేశం ఏపీ మంత్రి కానున్నారు. Also Read: YS Jagan: నేడు రెంటపాళ్లకి వైఎస్ జగన్..…
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2024 ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. నాలుగు దశాబ్దాలకు పైగా టిడిపితో అనుబంధం ఉన్న నల్లమిల్లి... తప్పని పరిస్థితుల్లో మాత్రమే ఈసారి కాషాయ కండువా కప్పుకున్నారు. రామకృష్ణారెడ్డి తండ్రి నల్లమిల్లి మూలారెడ్డి టిడిపి ఆవిర్భావం నుంచి కొనసాగుతూ అదే పార్టీ తరపున నాలుగు సార్లు అనపర్తి ఎమ్మెల్యేగా గెలిచారు.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా మొత్తం మీద పలాస రాజకీయాలు కాస్త తేడాగా ఉంటాయని చెప్పుకుంటారు. అందుకు తగ్గట్టే.... అసెంబ్లీ ఎన్నికల తర్వాత జిల్లా అంతా ప్రశాంతంగా ఉంటే... పలాసలో మాత్రం రాజకీయ కొలిమి రగులుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు పొలిటికల్ సెగలు పెరిగిపోతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో మంటెక్కిస్తున్నారు నేతలు.
అపోజిషన్ లో ఉండి రౌడీయిజం చేస్తానంటే ఇక్కడ ఉంది సీబీఎన్.. రౌడీయిజం చేస్తాం, రుబాబు చేస్తాం, పోలీసుల మీద దాడి చేస్తానంటే నోరు మూయించే శక్తి టీడీపీకి ఉంది అని తేల్చి చెప్పారు. 1996-97లో తీవ్రవాద సమస్య, రాయలసీమలో ఫ్యాక్షన్, హైదరాబాద్ లో మత ఘర్షణలు, గల్లీకొక రౌడీ ఉంటే.. అన్నింటినీ అరికట్టాను.. పులివెందుల మార్క్ రాజకీయం చేస్తానంటే తోక కట్ చేస్తాను అని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు.
JC Prabhakar Reddy: చంద్రబాబు అతి మంచితనం వల్లనే ఇంకా వైఎస్ఆర్సీపీ నాయకులు రోడ్లపై తిరుగుతున్నారు అని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు మా చేతులను కట్టేశారు.. రాష్ట్రంలో వైసీపీ నేతలు ఏం మాట్లాడినా రాష్ట్రాభివృద్ధి కావాలనే ఆలోచనతో చంద్రబాబు ఇవన్నీ పట్టించుకోవడం లేదు..
Vellampalli Srinivas: జగన్ అంటే నమ్మకం- చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం గడుస్తున్న ప్రభుత్వం చేసిన తప్పుడు వాగ్దానాలు ప్రజలకు తెలిసే విధంగా పుస్తకాన్ని ఏర్పాటు చేశాం అన్నారు.
TDP vs YCP: నంద్యాల జిల్లాలోని శ్రీశైలం నియోజకవర్గం అభివృద్ధిపై తాజా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ళు కొనసాగుతున్నాయి. నియోజకవర్గం అభివృద్ధిపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి విసిరిన సవాల్ కు మాజీ శాసన సభ్యుడు శిల్పా చక్రపాణిరెడ్డి స్పందించారు.
Ambati Rambabu: జగన్ పల్నాడు జిల్లా పర్యటనకు పోలీసులు చిత్రవిచిత్రమైన ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. పోలీసుల వేదింపులకు ఆత్మహత్యకు పాల్పడ్డ వైసీపీ కార్యకర్త నాగ మల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు.
CM Chandrababu: యోగాంధ్ర ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటున్న ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ఏపీ సర్కార్ తీసుకుందని చెప్పుకొచ్చారు.