మా విజయానికి కారణం ప్రేక్షకులే.. ఎమోషనల్ అయిన మోహన్ బాబు విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటించిన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ శుక్రవారం విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. శక్తివంతమైన కథ, గొప్ప తారాగణం, సాంకేతికంగా ఉన్నతంగా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది. ఈ సందర్భంగా శనివారం చిత్ర బృందం హైదరాబాద్‌లో ఓ థ్యాంక్స్ మీట్ నిర్వహించింది.ఈ ఈవెంట్లో డిస్ట్రిబ్యూటర్ మైత్రి శశి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ మహేశ్వరి, నటులు శివ…
CM Chandrababu: ఈరోజు ఉదయం 11గంటలకి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కన్వీనర్లు హాజరుకానున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలపై టీడీపీ అధిష్టానం శీతకన్ను వేసిందంటూ తెగ ఫీలవుతున్నారట తమ్ముళ్లు. విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ, కైకలూరు సెగ్మెంట్స్‌లో ఇప్పటి వరకు పార్టీ ఇన్ఛార్జ్లు లేరు. ఈ మూడింటిలో రెండు చోట్ల బీజేపీ, అవనిగడ్డలో జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 16 నియోజకవర్గాలు ఉంటే అందులో 13 చోట్ల టీడీపీ గెలవగా... మిగతా మూడింటిని మిత్రపక్షాలు కైవసం చేసుకున్నాయి. ఎన్నికల సమయంలో ఇక్కడ నుంచి పోటీ చేయటానికి కొందరు…
రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు మాజీ టీడీపీ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం.. అవినీతి జరగలేదని 164 మంది ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరైనా కాణిపాకానికి వచ్చి ప్రమాణం చేస్తారా ? అంటూ ఆయన సవాలు విసిరారు.. ఈ మధ్యే టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ జడ్పీ చైర్మన్ సుగవాసి బాలసుబ్రమణ్యం.. కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు..
ఆదివారం రోజు కీలక సమావేశానికి సిద్ధమయ్యారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రేపు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ విస్తృతస్థాయి సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కన్వీనర్లు హాజరుకానున్నారు.. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జులై 2వ తేదీ నుండి కూటమి పార్టీ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు సీఎం…
జులై ప్రారంభం నుంచి జనంలోకి వెళ్లనున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు. ఈ విషయంలో ఇప్పటికే వారికి అధినేత నుంచి ఆదేశాలు అందాయి. అయితే... టీడీపీ నేతలను ఓ డౌట్ బాగా వేధిస్తోందట. అధినేత ఆదేశించినట్టుగానే జనంలోకి వెళ్తాం సరే. వెళ్లి ఏం జనానికి ఏం చెప్పాలి..? సూపర్ సిక్స్‌లో పెండింగ్‌లో ఉన్న పథకాల గురించి జనం ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలి..? ఎలా కన్విన్స్ చేయాలి..? అని లోలోపల మధనపడిపోతున్నారట.
విజయనగరం జిల్లా శృంగవరపు కోట రాజకీయం సలసలకాగుతోందట. ఇక్కడ.. ఎవరు సొంతోళ్ళో... ఎవరు ప్రత్యర్థులో కూడా అర్ధంకానంత గందరగోళం పెరిగిందని అంటున్నారు. ప్రస్తుతం పైకి మాత్రం ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి వర్సెస్ ఎమ్మెల్సీ రఘురాజుగా నడుస్తోంది వ్యవహారం. ఎమ్మెల్యేది టీడీపీ, ఎమ్మెల్సీది వైసీపీ కావడంతో... ఆ రాజకీయ వైరం సహజమేననుకున్నారు.
పరిస్థితుల్ని బట్టి ఓడలు బళ్ళు....బళ్ళు ఓడలు కామన్. రాజకీయాల్లో అయితే.... దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునే పనేలేదు. సరిగ్గా ఇప్పుడు అదే స్ధితిని అనుభవిస్తున్నారట ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు. శాసనసభ్యులుగా గెలిచి ఏడాది పూర్తయిందన్న మాటేగానీ... సెల్ఫ్ శాటిశ్ఫాక్షన్ ఏ మాత్రం లేదట. 15 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఉమ్మడి జిల్లాలో అరకు, పాడేరు మినహా మిగిలిన సీట్లన్నిటినీ కూటమి పార్టీలు ఏకపక్షంగా గెలుచుకున్నాయి.
చంద్రబాబు సీఎంగా ఉన్నంతవరకూ అరాచకవాదులకు రాష్ట్రంలో స్థానం లేదని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. గుంటూరులోని ఆర్వీఆర్ జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీసు ఏఐ హ్యాకథాన్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టెక్నాలజీని పోలీసులు ఏ విధంగా ఉపయోగించుకోవాలనేదానిపై ఏఐ హ్యాక్ థాన్ కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం అభినందనీయం అన్నారు..
రెడ్ బుక్.... ఏపీ పాలిటిక్స్‌లో ఇదో హాట్ సబ్జెక్ట్. దీనికి సంబంధించే అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య తరచూ ఆరోపణలు, సవాళ్ళ పర్వం నడుస్తూ ఉంటుంది. మంత్రి లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రెడ్‌బుక్ ఓపెన్ చేస్తే... ఇప్పుడు టీడీపీ నాయకులు కొందరు లోకల్ బుక్స్‌ని ఓపెన్ చేసేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. పైగా... లోకేష్ తన రెడ్‌బుక్‌ని క్లోజ్ చేసినా... నేను మాత్రం సంగతి తేలేదాకా మూసే ప్రసక్తే లేదని అంటున్నారట గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం.