Sugavasi Subramanyam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అవినీతి పెచ్చు మీరి పోయిందని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ టీడీపీ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం ఆరోపించారు.. అవినీతి జరగలేదని కూటమి ఎమ్మెల్యేలు కాణిపాకం లో ప్రమాణానికి సిద్ధమ అంటూ ఆయన సవాల్ విసిరారు. టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత మొదటిసారిగా ఆయన టీడీపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు… రాయచోటిలో జరిగిన వైసీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో.. తెలుగుదేశం పార్టీపై నిప్పులు చెరిగారు… రాష్ట్రంలో ధన ఉన్మాదం రాజ్యమేలుతోందని ఆయన ఆరోపించారు… గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు అవినీతి జరుగుతున్నట్లు ఆయన ఆరోపించారు.. ఈ అంశాన్ని తాను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకపోవడంతో తాను టీడీపీకి రాజీనామా చేసినట్లు వివరించారు.
Read Also: Bigg Boss 9 : బిగ్ బాస్-9లోకి ఎవరైనా వెళ్లే ఛాన్స్.. ఇలా చేయండి చాలు..
నాలుగు దశాబ్దాల పాటు టీడీపీలో కొనసాగిన ఆ కుటుంబం.. ఇప్పుడు వైసీపీలో కీలకంగా మారిందని రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సుగవాసి బాలసుబ్రమణ్యం అంటున్నారు.. టీడీపీలో జరుగుతున్న అవినీతి అక్రమలను చూసి సహించలేక, తాను టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరానని స్పష్టం చేశారు.. టీడీపీకి రాజీనామా చేసిన వెంటనే.. ఆయన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు… వైసీపీలో చేరిన తరువాత మొదటిసారిగా జరిగిన వైసీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో టీడీపీపై విరుచుకుపడ్డారు.. టీడీపీలో కొనసాగుతున్న సమయంలో కూడా ఆయన పలువురు టిడిపి నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు… ఇసుక మట్టి మాఫియాతో టిడిపి నేతలకు సంబంధాలు ఉన్నాయంటూ ఆయన ఆరోపించారు… సుగవాసి బాలసుబ్రమణ్యం ఆరోపణలతో అటు రాజంపేట, ఇటు రాయచోటి నియోజకవర్గా లలో టిడిపి నేతలు మట్టి, ఇసుక జోలికి వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయట.. అయితే టిడిపికి రాజీనామా చేసిన తర్వాత కూడా మళ్లీ ఆయన టీడీపీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు..