CM Chandrababu: చంద్రబాబు సీఎంగా ఉన్నంతవరకూ అరాచకవాదులకు రాష్ట్రంలో స్థానం లేదని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. గుంటూరులోని ఆర్వీఆర్ జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీసు ఏఐ హ్యాకథాన్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టెక్నాలజీని పోలీసులు ఏ విధంగా ఉపయోగించుకోవాలనేదానిపై ఏఐ హ్యాక్ థాన్ కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం అభినందనీయం అన్నారు.. లా అండ్ ఆర్డర్ పై ఎప్పుడూ దృష్టిపెడతాను. చంద్రబాబు సీఎంగా ఉన్నంతవరకూ అరాచకవాదులకు రాష్ట్రంలో స్థానం లేదని స్పష్టం చేశారు.. టెక్నాలజీని అందరూ ఉపయోగించుకోవాలని సూచించిన ఆయన.. అప్పట్లో బిల్ క్లింటన్, వాజ్ పేయి హయాంలో సైబర్ సిటీ, హైటెక్ సిటీ ప్రారంభించాం. 25 ఏళ్లలో ఐటీవల్ల ఎక్కువ ఆదాయం హైదరాబాద్‌కు వస్తుందని తెలిపారు.. క్వాంటం వ్యాలీకింద ఏఐకి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా తెలుగువారి సత్తా ప్రపంచానికి చాటిచెప్పబోతున్నాం. మీ పిల్లలను బాగా చదివించండి… మీరు పెట్టిన ఖర్చుకు అనేకరెట్లు సంపాదిస్తారు. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా తెలుగువారు ఉంటారని తెలిపారు.
Read Also: Jagannath Rath Yatra 2025: జగన్నాథ రథ యాత్రలో బంగారు చీపురుతో ఎందుకు శుభ్రం చేస్తారు..?
ప్రపంచంలో హయ్యస్ట్ పర్ కాపిటా సంపాదించేవారిలో 35శాతం తెలుగువారు ఉన్నారు.. రేపు ఏదైనా విపత్తు వస్తే నేరుగా వారికి డ్రోన్ ద్వారా సాయం అందించే పరిస్థితి వస్తుంది. వాట్సప్ గవర్నెన్స్ అందరూ ఉపయోగించుకోండి అని సూచించారు సీఎం చంద్రాబు.. .విద్యార్థులు సర్డిఫికెట్లకోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఆగష్టు15 నుంచి వాట్సప్ గవర్నెన్స్ ద్వారా మీకు అందుతాయి. మేధోశక్తితో పనిచెయ్యాలి. హార్డ్ వర్క్ కాదు… స్మార్ట్ వర్క్ చెయ్యాలి. డేటా క్లౌడ్ లో ఉంటుంది. స్పేస్ సిటీకింద ప్రైవేట్ సంస్థలు కూడా శాటిలైట్ ప్రయోగించే అవకాశాలు కల్పిస్తాం. రౌడీయిజం చేసేవారిని చొక్కా పట్డుకునే పరిస్థితి తీసుకొస్తా. ఏం జరిగినా నేరుగా మీ ఇంటికి నోటీసులు వస్తాయి. దేశంలో మొదటిసారిగా క్వాంటం వ్యాలీకి శ్రీకారం చుట్టామని వెల్లడించారు..
Read Also: YS Jagan: వైఎస్ జగన్‌కు ఊరట.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
ప్రపంచానికి భారతదేశమే ఏఐకి నాయకత్వం ఇస్తుంది. థింక్ గ్లోబల్లీ… యాక్ట్ గ్లోబల్లీ అని సూచించారు సీఎం చంద్రబాబు.. ఐటీ మన జీవితంలో భాగమైపోయింది.. సెల్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచంలో ఎక్కడికైనా పోవచ్చు.. తెలుగువారు నెంబర్‌వన్ గా ఉండాలనేది నా ఆకాంక్ష.. ర్యాపిడో వ్యవస్థాపకుడు ఈ జిల్లాకు చెందిన వ్యక్తి.. ఐదారేళ్లో బిలియన్ డాలర్ల కంపెనీగా మారింది. ఇన్నోవేటివ్ గా ఆలోచించాలని సూచించారు సీఎం చంద్రబాబు నాయుడు.