Minister Ramprasad Reddy: వైసీపీ నాయకులు, కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి మాటలు విని ప్రజల జోలికి వస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు అంటూ వార్నింగ్ ఇచ్చారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అశాంతి నెలకొల్పేందుకు రెచ్చగొట్టే కార్యక్రమాన్ని నిర్వహించే వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.. వైసీపీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శల పేరుతో మందీమార్బలంతో వెళ్లి అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు.. విజయవాడలో వరదలు వచ్చిన సమయంలో 75 ఏళ్ల వయసులో 12 రోజులు ప్రజల మధ్యనే ఉండి ఆదుకున్న నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు… వరద కష్టాలు తెలిసిన ప్రజలను పరామర్శించకుండా బెంగళూరుకు పారిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు.. ఇప్పుడు కార్యకర్త చనిపోయారని సాకు పెట్టుకుని ప్రజలలో దండయాత్రగా వెళ్లి అంతు చూస్తామని సినిమా పోస్టర్లు వేయించుకుంటున్నాడు… ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని మండిపడ్డారు.
Read Also: US Strike: ‘‘అవును, మా అణు కేంద్రాలు దారుణంగా దెబ్బతిన్నాయి’’.. ఒప్పుకున్న ఇరాన్..
గత ఐదేళ్లలో పాలకులు చేసిన పాపాలు ఎలా ఉన్నాయి.. ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని సూచించారు రాంప్రసాద్‌రెడ్డి.. గత 10 రోజులలో రాష్ట్రంలోని 64 లక్షల మందికి రూ.8500 కోట్లు ఖాతాలలో జమ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది అని వెల్లడించిన ఆయన.. ప్రభుత్వ కార్యక్రమాలు చూసి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కి కడుపు మండే రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నాడు అని దుయ్యబట్టారు.. వైసీపీ నాయకులు, కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి మాటలు విని ప్రజల జోలికి వస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు… వైసీపీ గుండాలు జైలలో పడితే వాళ్లను పరామర్శించడానికి జగన్ వెళ్తారు.. తప్పా ప్రజల కోసం ఏనాడు జనంలోకి రాలేదు అని ఎద్దేవా చేశారు.. వైసీపీ అరాచకాలను ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు.. చట్ట పరిధిలో కఠిన చర్యలు తీసుకుంటుంది.. రాబోయే రోజుల్లో ఇచ్చిన మాట ప్రకారం మరిన్ని సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేయడం జరుగుతుందన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి..