అమరావతి డీజీపీ గౌతమ్ సవాంగుకు చంద్రబాబు లేఖ రాశారు. కర్నూల్ జిల్లా కోసిగి మండలంలో టీడీపీ పార్టీ నేత తిక్కారెడ్డి పై దాడి ఘటనలో చర్యలు తీసుకోవాలని ఈ లేఖలో డిమాండ్ చేశారు చంద్రబాబు. బొంపల్లెలో ఆలయానికి వెళ్లిన తిక్కారెడ్డిపై వైసీపీ నేతలు దాడి చేశారని… వైసీపీ కార్యకర్తల దాడిలో ఐదుగురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలను అడ్డుకోవడంవో పోలీసులు విఫలం అవుతున్నారని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్…
చంద్రబాబు పై వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు సెటైర్లు వేశారు. అఖండ సినిమా చూసిన ఫ్రస్టేషన్ తో చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టినట్లు ఉన్నారు. చంద్రబాబు చూడాల్సింది జస్టిస్ చంద్రు మాట్లాడిన వీడియో…. ఆ వీడియోలు చూసే ధైర్యం చంద్రబాబుకు ఉందా అన్ని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో టీడీపీ స్కిల్ తో చేసిన స్కాంను బయట పెట్టాల్సి న బాధ్యత ఈ ప్రభుత్వం పై ఉంది. స్ట్రా వేసి తమ ఐదేళ్ళ కాలంలో ఎంతో…
మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం నిప్పులు చెరిగారు. ఏపీని సొంత ప్రయోజనాల కోసం కేంద్రంకు తాకట్టుపెట్టారంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించిన చంద్రబాబు మాట్లాడుతూ.. రైల్వే జోన్‌పై ఆనాడు అనేక మాటలు మాట్లడిన జగన్.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వేజోన్ పరిశీలనలో లేదంటే ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అంతేకాకుండా విశాఖపై ప్రేమ చూపించే వైసీపీ రైల్వే జోన్‌పై ఏం సమాధానం చెబుతారన్నారు. సమాధానం చెప్పలేని సీఎం ఏవిధంగా…
పేద ప్రజలను వైసీపీ ప్రభుత్వం నిలువునా దోపిడీ చేస్తోందని మాజీ మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. నేడు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇసుక, భూకబ్జాలు, లిక్కర్, గనులదోపిడీతో వైసీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పుడు పేద ప్రజలను కూడా దోచుకోవడానికి సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నుంచి గత ప్రభుత్వాలు చేసిన పనులను తాము చేసినట్టు రంగులు వేసుకుని…
ఏపీలో మరోసారి రాజకీయం వేడెక్కింది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరం పనుల్లో అవినీతి జరిగిందన్నారని.. కానీ కేంద్రం ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదని తేల్చిచెప్పిందన్నారు. రివర్స్ టెండరింగ్‌తో ప్రాజెక్టులను నాశనం చేశారని.. రివర్స్ టెండరింగ్‌లో ఏం సాధించారు..? అని ఆయన ప్రశ్నించారు. అవగాహన లేక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని.. పార్లమెంట్లో ఏపీ ప్రత్యేక హోదా గురించి ఎందుకు ప్రస్తావించలేదన్నారు. చిత్తశుద్ది ఉంటే వైసీపీ ఎంపీలు…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వం తీరుపై పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు.
ఏపీలో మరోసారి టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. రైతు రుణ విముక్తి విషయంలో ఏమి జరిగిందో, లక్ష కోట్లు 20 వేల కోట్లు ఎలా అయ్యాయో అందరికీ తెలుసునని అన్నారు. అంతేకాకుండా మీడియా ముసుగులో దశబ్దాలు తరబడి టీడీపీ కోసం రౌడీయిజం, రుబాబు చేస్తున్నారని, చంద్రబాబు వస్తే అంతా ప్రశాంతంగా ఉంటుంది అంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి పథకాలను రోజూ…
ఏపీలో ఓటీఎస్‌పై మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. వన్ టైం సెటిల్మెంట్ అంటూ ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకంపై మీడియా పేరుతో కొన్ని సంస్థలు టెర్రరిజం చేస్తున్నాయంటూ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్ చేస్తారని, ఈ పథకం వల్ల పేదలకు జరిగే ప్రయోజనాన్ని ప్రజలకు వివరించాల్సింది పోయి విమర్శలు చేస్తారా అంటూ ధ్వజమెత్తారు. గత టీడీపీ ప్రభుత్వం కనీసం వడ్డీ…
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తుపై ఎప్పటికప్పుడూ కొత్త తరహా ప్రచారం జరుగుతూనే ఉంటుంది.. ఈ మూడు పార్టీలు ఎప్పుడైనా ఏకం కావొచ్చు అనే అంచనాలుంటాయి.. అయితే, ప్రస్తుతం ఏపీలో బీజేపీ-జనసేన పొత్తు కొనసాగుతుండగా.. టీడీపీ విడిగానే రాజకీయాలు చేస్తోంది.. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో కొన్ని చోట్ల కలిసి పనిచేసిన సందర్భాలు కూడా లేకపోలేదు.. కానీ, ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే, పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల…