ఏపీ అభివృద్ధి కోసమే సీఎం జగన్ 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారని హోంమంత్రి సుచరిత వెల్లడించారు. అమరావతిని రాజధానిగా టీడీపీ ప్రభుత్వం ప్రకటించి, కేవలం తాత్కాలిక భవనాలు మాత్రమే నిర్మించిందన్నారు. అమరావతిపై బీజేపీ వైఖరి కేంద్రంలో ఒకలా, రాష్ట్రంలో మరోలా ఉందన్నారు. 3 రాజధానుల అంశం రాష్ట్ర పరిధిలోనిదని కేంద్రమే చెప్పిందని సుచరిత చెప్పారు.
Read Also: జనసేన ‘డిజిటల్’ ఉద్యమం ప్రారంభం.. స్పందన లభించేనా?
కానీ ఇక్కడ మాత్రం అమరావతి రాజధానిగా ఉండాలని బీజేపీ చెబుతోందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ ఎందుకు యూటర్న్ తీసుకుందని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ఎందుకు ప్రైవేటీకరణ చేస్తుందో చెప్పాలని సుచరిత డిమాండ్ చేశారు. ఏపీ ప్రయోజనాలకు భంగం కలిగించేలా బీజేపీ వ్యవహరిస్తోందన్నారు. తిరుపతి సభలో అన్ని పార్టీలు ఏకమయ్యాయన్నారు. సింగిల్‌గా పోటీ చేసే ధైర్యం టీడీపీకి లేదని హోంమంత్రి సుచరిత ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా తమ తీరు మార్చుకుని అభివృద్ధిలో కలిసి రావాలని సూచించారు.