మాజీ ఆర్థిక మంత్రి యనమలకు తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో తుని నుంచి యనమల కుటుంబం లేదా ప్రత్యర్ధి ఎవరైనా 15 వేలు మెజారిటీతో గెలుస్తాను. 15 వేల కంటే తక్కువ ఓట్ల మెజారిటీ వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని పేర్కొన్నారు. నాపై గెలుపు సంగతి అలాఉంచి నాకు 15వేలు మెజారిటీ రాకుండా చూసుకోండి అని సవాల్ విసిరారు. ఐటీజే తుని నియోజకవర్గంలో 64 ఎంపీటీసీలకు జరిగిన…
హెటేరో ఫార్మా కంపెనీ పైపులైన్ కు వ్యతిరేకంగా మత్స్యకారులు చేస్తున్న ఆందోళనకు మద్దతు ప్రకటించింది టీడీపీ. నక్కపల్లి(మం)రాజయ్యపేట దగ్గర మత్యకారులు దీక్షా శిబిరాన్ని సందర్శించారు తెలుగు మహిళ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత. అయితే నేటితో 12వ రోజుకు చేసుకుందిమత్స్యకారుల శాంతియుత ధర్నా. అక్కడ ఆవిడ మాట్లాడుతూ… సముద్రంలోకి పంపుతున్న రసాయన వ్యర్థజలాలు వల్ల మత్యసంపాద నశించుపోతుంది. మత్యకారులు అందరూ కూడా వలసలు వెళ్లి బ్రతకావలసిన పరిస్థితి వచ్చింది. అనుమతులు లేకుండా పైపులైన్ వేస్తుంటే అధికారులు…
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యరు. కుప్పం ప్రజలు తనకు వెన్నుపోటు పొడిచారంటూ చంద్రబాబు ఆరోపించడం ఏంటని ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి చంద్రబాబుపై మండిపడ్డారు. వెన్నుపోటుల గురించి చంద్రబాబు చెప్పడమేంటని ఆయన అన్నారు. పార్టీ నేతలే కుప్పంలో తనకు వెన్ను పోటు పొడిచారంటూ వెన్నుపోట్ల పితామహుడు చంద్రబాబు వాపోతున్నాడు. కోవర్టులను సహించనంటున్నాడు. నీవు నేర్పిన విద్యే నీరజాక్షా అంటున్నారు కార్యకర్తలు. ఎన్టీఆర్‌కు నువ్వు పొడిచిన పోటుతో పోలిస్తే కుప్పానిదీ ఒక పోటా…
అమరావతి డీజీపీ గౌతమ్ సవాంగుకు చంద్రబాబు లేఖ రాశారు. కర్నూల్ జిల్లా కోసిగి మండలంలో టీడీపీ పార్టీ నేత తిక్కారెడ్డి పై దాడి ఘటనలో చర్యలు తీసుకోవాలని ఈ లేఖలో డిమాండ్ చేశారు చంద్రబాబు. బొంపల్లెలో ఆలయానికి వెళ్లిన తిక్కారెడ్డిపై వైసీపీ నేతలు దాడి చేశారని… వైసీపీ కార్యకర్తల దాడిలో ఐదుగురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలను అడ్డుకోవడంవో పోలీసులు విఫలం అవుతున్నారని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్…
చంద్రబాబు పై వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు సెటైర్లు వేశారు. అఖండ సినిమా చూసిన ఫ్రస్టేషన్ తో చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టినట్లు ఉన్నారు. చంద్రబాబు చూడాల్సింది జస్టిస్ చంద్రు మాట్లాడిన వీడియో…. ఆ వీడియోలు చూసే ధైర్యం చంద్రబాబుకు ఉందా అన్ని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో టీడీపీ స్కిల్ తో చేసిన స్కాంను బయట పెట్టాల్సి న బాధ్యత ఈ ప్రభుత్వం పై ఉంది. స్ట్రా వేసి తమ ఐదేళ్ళ కాలంలో ఎంతో…
మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం నిప్పులు చెరిగారు. ఏపీని సొంత ప్రయోజనాల కోసం కేంద్రంకు తాకట్టుపెట్టారంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించిన చంద్రబాబు మాట్లాడుతూ.. రైల్వే జోన్‌పై ఆనాడు అనేక మాటలు మాట్లడిన జగన్.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వేజోన్ పరిశీలనలో లేదంటే ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అంతేకాకుండా విశాఖపై ప్రేమ చూపించే వైసీపీ రైల్వే జోన్‌పై ఏం సమాధానం చెబుతారన్నారు. సమాధానం చెప్పలేని సీఎం ఏవిధంగా…
పేద ప్రజలను వైసీపీ ప్రభుత్వం నిలువునా దోపిడీ చేస్తోందని మాజీ మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. నేడు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇసుక, భూకబ్జాలు, లిక్కర్, గనులదోపిడీతో వైసీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పుడు పేద ప్రజలను కూడా దోచుకోవడానికి సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నుంచి గత ప్రభుత్వాలు చేసిన పనులను తాము చేసినట్టు రంగులు వేసుకుని…
ఏపీలో మరోసారి రాజకీయం వేడెక్కింది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరం పనుల్లో అవినీతి జరిగిందన్నారని.. కానీ కేంద్రం ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదని తేల్చిచెప్పిందన్నారు. రివర్స్ టెండరింగ్‌తో ప్రాజెక్టులను నాశనం చేశారని.. రివర్స్ టెండరింగ్‌లో ఏం సాధించారు..? అని ఆయన ప్రశ్నించారు. అవగాహన లేక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని.. పార్లమెంట్లో ఏపీ ప్రత్యేక హోదా గురించి ఎందుకు ప్రస్తావించలేదన్నారు. చిత్తశుద్ది ఉంటే వైసీపీ ఎంపీలు…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వం తీరుపై పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు.