వంగవీటి రంగా వర్థంతి సభలో తాజాగా వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.. తనను హత్య చేయడానికి రెక్కీ నిర్వహించారని రాధా సంచలనానికి తెరలేపారు.. తననేదో చేద్దామని కుట్ర చేశారని.. దేనికీ భయపడనని రాధా స్పష్టం చేవారు. తాను ప్రజల మధ్య ఉండే మనిషినని చెప్పిన రాధా.. అన్నింటికీ సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. అయితే, ఇవాళ వంగవీటి రాధాకు సెక్యూరిటీ పెంచింది ఏపీ ప్రభుత్వం.. వంగవీటి రాధాకు 2+2 భద్రత కల్పించాలని…
ఏపీ ప్రభుత్వం ఇటీవల వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ఓటీఎస్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలు చేస్తున్నాయి. అయితే తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ఓటీఆఎస్ను రద్దు చేయాలంటూ కలేక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ.. అన్ని వర్గాల వారిని జగన్ దోపిడీ చేస్తున్నాడని ఆయన అన్నారు.…
ఏపీలో సినిమా టిక్కెట్ల విషయంలో దూమారం చేలరేగుతున్న విషయం తెల్సిందే..దీని పై తాజాగా టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిఏసీ సీఎం జగన్ మోహన్‌రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో సిమెంట్ బస్తా రేటు కూడా ₹100 కి తీసుకొచ్చి.. దేశ చరిత్రలోనే నిజంగా చిత్తశుద్ధి ఉన్న ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోండి అంటూ ట్వీట్ చేశారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. సిమెంట్ బ్యాగ్ మీద మీ కమిషన్లు తగ్గించు కుంటే వాటి…
కృష్ణా జిల్లా చిన్న గొన్నూరులో వంగవీటి మోహన రంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో వంగవీటి రాధా పాల్గొన్నారు. అనంతరం ఆయన సంచలన ఆరోపణలు చేశారు. రాధా చేసిన ఆరోపణలు ఎవ్వరి మీద అనేది స్పష్టత రావాల్సి ఉంది. అత్యుత్సాహం కొద్ది ఏదో చేద్దామని చెప్పి తనను చంపాలని చూశారని ఆయన అన్నారు. దీని కోసం రెక్కీ కూడా నిర్వహించారన్నారు. వారు ఎవ్వరో త్వరలో తెలుస్తుందన్నారు. రంగా గారి అబ్బాయిగా జనంలోనే ఉంటా, జనంతో ఉంటానన్నారు. ఎవ్వరు ఏ…
వైసీపీ మళ్ళీ అధికారం లోకి రావడం ఖాయమని.. ఈ విషయాన్ని ఎల్లో మీడియా గుర్తు పెట్టుకోవాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్నికల ఫలితాలు మార్చే పరిస్థితి ఉండదని చురకలు అంటించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశారని… గ్రామాల్లోకి వెళితే కేవలం ఇల్లు కోసం అర్జీలు, లేదా భూ వివాదాలపై మాత్రమే ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. జగనన్న శాశ్వత భూ హక్కు,…
పార్టీకి ఛార్జింగ్ ఎక్కించేందుకు అక్కడ టీడీపీ ప్రయోగాలు చేస్తోందా? ఈక్వేషన్లు తేడా కొడుతున్నాయా? బలమైన నాయకత్వం ఉన్నా.. క్షేత్రస్థాయిలో పార్టీ బలహీనంగా ఉందా? తాజా ప్రయోగమైనా ఫలితాన్నిస్తుందా? ఏంటా నియోజకవర్గం? ఇంఛార్జ్ మార్పు టీడీపీకి కలిసి వస్తుందా? కర్నూలు జిల్లా నందికొట్కూరు. ఈ నియోజకవర్గంలో ఒకప్పుడు బలంగా ఉన్న టీడీపీ ఇపుడు జీరో అనే చెప్పాలి. ఈ పరిస్థితికి టీడీపీ అధిష్ఠానం బాధ్యతారహిత్యం కూడా కారణమని చెబుతారు. పచ్చ జెండాపై ప్రేమ, టీడీపీపై అభిమానం ఉన్న కేడర్‌లో…
టీడీపీ చేసిన తప్పే తిరిగి చేస్తోందా? సామాజిక సమీకరణాలపై మళ్లీ పప్పులో కాలేస్తోందా? తాజా పరిణామాలపై తమ్ముళ్లలో జరుగుతున్న చర్చ ఏంటి? గతంలో చేసిన పొరపాట్ల నుంచి పార్టీ గుణపాఠాలు నేర్చుకోలేదా? సామాజిక సమీకరణాల్లో పాత పద్ధతే అనుసరిస్తున్నారా? గతంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ సామాజిక సమీకరణాల పరంగా కొన్ని తప్పిదాలకు పాల్పడిందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలను కాదని.. కాపు సామాజికవర్గం వైపు మొగ్గు…
ఇంఛార్జ్‌ల విషయంలో చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు టీడీపీకి ప్లస్సా.. మైనస్సా? పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? పొరపాట్లకు ఎక్కడ ఆస్కారం ఇస్తున్నారు? తమ్ముళ్ల పడుతున్న ఇబ్బందులేంటి? క్షేత్రస్థాయి నుంచి సరైన ఫీడ్ బ్యాక్ లేదా? ఏపీలోని 175 అసెంబ్లీ సెగ్మెంట్లకుగానూ.. సుమారు 40 నుంచి 50 నియోజకవర్గాల్లో టీడీపీకి ఇంఛార్జులు లేరు. వీలైనంత త్వరగా అక్కడ ఇంఛార్జులను నియమించే పనిలో స్పీడ్ పెంచారు చంద్రబాబు. కొన్ని నియోజకవర్గాల విషయంలో ఇబ్బందులు లేకపోయినా.. మరికొన్ని చోట్ల మాత్రం పార్టీలో…
విజయనరగంలోని రామతీర్ధం ఘటనలు హిందువుల మనోభావాలు దెబ్బతీశాయని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఈ ఘటనకు వైసీపీ, టీడీపీలు బాధ్యత వహించాలని అన్నారు. ఇప్పటి వరకు ఆ ఘటనలకు సంబంధించిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్దికి కేంద్రం సహకరిస్తోందని, హిందు ధార్మిక అలయాలన అభివృద్ధి కోసం రాష్ట్ర బడ్జెట్ నుంచి కూడా నిధుల కేటాయించాలని అన్నారు. రాష్ట్రంలో సినిమా టికెట్ల అంశాన్ని వైసీపీ అనవసరంగా వివాదం చేస్తున్నదని అన్నారు. Read:…
నాపై నమోదైన ఎఫ్ఐఆర్ పై హైకోర్టును ఆశ్రయించాను అని అశోక్ గజపతిరాజు తెలిపారు. నాపై నమోదు అయిన కేసులో పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చారు. నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న రామతీర్ధంలో ఎన్నడూ లేని ఘటనలు ఈ ప్రభుత్వ హయాంలో జరగటం బాధాకరం. దేవస్ధానంకి సమర్పించే కానుకలకు కూడా మంత్రులు అనుమతులు అడుగుతున్నారు. మంత్రులు నా కుటుంబం, నా సంస్కారం కోసం మాట్లాడుతున్నారు. నా కుటుంబం దేశద్రోహి కుటుంబం అంటున్నారు. నన్ను విమర్శించే వారిని వారి విజ్ఞతకే…