గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.వంగవీటిరాధా ప్రాణాలకు ముప్పు ఉందని అతడు చెప్పినప్పటి నుంచి రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. దీంతో ప్రభుత్వం ఇద్దరూ గన్‌మెన్‌లను పంపిచినప్పటికీ రాధా సున్నితంగా తిరస్కరించారు. తాజాగా ఈ అంశంపై టీడీపీ సీనియర్‌నేత కళా వెంకట్రావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంగవీటి రాధపై రెక్కీ నిర్వహించడం బాధాకరమని టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు అన్నారు. ప్రభుత్వం మాటలు చెబుతోంది కానీ.. ఇప్పటివరకు రెక్కీ నిర్వహించిన వారిని పట్టుకోలేదని విమర్శించారు.
Read Also:సీఎం పుట్టినరోజే పేదల రక్తాన్ని పీల్చే పథకం ప్రారంభించారు: అచ్చెన్నాయుడు
ఏపీ సీఎం జగన్, మంత్రులు దీనిని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారన్నారు. వంగవీటి రంగాను హత్య చేయడం మంచిదేనన్న వ్యక్తులకు వైసీపీ లో కార్పొరేషన్ పదవులు ఇచ్చారు. వంగవీటి రాధ సహనం, ఓర్పు ఉన్న మంచి నాయకుడు. అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపారని కళావెంకట్రావ్ అన్నారు. వైసీపీ నేతలు రెక్కీ నిర్వహిస్తే చర్యలు తీసుకోక కట్టు కథలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. కొన్ని సామాజిక వర్గాలను రెచ్చగొట్టటానికే ఈ తతంగం అని ప్రభుత్వంపై మండిపడ్డారు. వంగవీటి రాధా టీడీపీలో ఉన్నాడనే అక్కసుతోనే రెక్కీ నిర్వహించారని కళావెంకట్రావ్ ఆరోపించారు.