ఏపీ మాజీ మంత్రి జవహర్ రెడ్డి జగన్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి క్రైస్తవుడు కాదని, క్రైస్తవుడు అని చెప్పుకుంటూ క్రైస్తవాన్ని అపహాస్యం చేస్తున్నాడన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా జగన్ పరిపాలన కొనసాగుతుందని విమర్శించారు. ఏ మతం ధర్మం మీద కూడా జగన్ కి విశ్వాసం లేదని ఆయన అన్నారు. ముస్లింలకి షాదీ ముబారక్ లేదన్నారు. Read Also: పీఆర్సీ బ్రహ్మ పదార్థంగా…
గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.వంగవీటిరాధా ప్రాణాలకు ముప్పు ఉందని అతడు చెప్పినప్పటి నుంచి రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. దీంతో ప్రభుత్వం ఇద్దరూ గన్మెన్లను పంపిచినప్పటికీ రాధా సున్నితంగా తిరస్కరించారు. తాజాగా ఈ అంశంపై టీడీపీ సీనియర్‌నేత కళా వెంకట్రావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంగవీటి రాధపై రెక్కీ నిర్వహించడం బాధాకరమని టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు అన్నారు. ప్రభుత్వం మాటలు చెబుతోంది కానీ.. ఇప్పటివరకు…
ఏపీ సీఎం పుట్టిన రోజే పేదల రక్తాన్ని పీల్చే పథకాన్ని ప్రారంభించారని టీడీపీ రాష్ర్ట అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఓటిఏస్ పథకాన్ని పూర్తిగా రద్దు చేసి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసేవరకు టీడీపీ పోరాడుతుందన్నారు.ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు కట్టిన ఇళ్లపై దుర్మార్గంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు.టీడీపీ హయాంలో రద్దు చేయలేదుఎందుకనీ బొత్స అంటున్నారని, కానీ మీరు ఇంత దుర్మార్గులని ఊహించలేదని అచ్చెన్నాయుడు అన్నారు. కేవలం…
జగనన్న పాల వెల్లువ కార్యక్రమం పై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. మేమేదో పాపం చేసినట్టు, అమూల్‌కి సంపద దోచిపెట్టినట్లు మాట్లాడుతున్నారు. అమూల్ అనేది ప్రైవేట్ సంస్థ కాదు.. సహకార సంస్థ రాష్ట్రంలో ఉన్న సహకార సంస్థలు అన్నింటిని చంద్రబాబు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మార్చారని ఆయన వ్యాఖ్యానించారు. పాడి రైతులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటున్నాంసంగం డెయిరీ ఆస్తులు ప్రభుత్వ ఆస్తులని మంత్రి పేర్కొన్నారు. Read Also: ఆ…
రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోవడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. కేంద్రం రాష్ట్రం పట్ల వివక్ష ప్రదర్శిస్తోంది. రాష్ట్ర ప్రజలకు బీజేపీ క్షమాపణలు చెప్పాలి. ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీ రాష్ట్రానికి అంతా తామే చేస్తున్నారని ప్రచారం చేసుకుంటున్నారు. ఆడిన మాటను తప్పే వారిని ఏమంటారో బీజేపీ వాళ్లు గుర్తు చేసుకుంటే మంచిదన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించలేని బీజేపీ విశాఖ ఉక్కును అమ్మేస్తానంటోంది.ప్రజలు బీజేపీని ఛీత్కరిస్తున్నారు.బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా వైసీపీ,…
వంగవీటి రాధాపై రెక్కీ వార్తలు ఏపీ పాలిటిక్స్‌లో కలకలం రేపాయి.. ఆ విషయాన్ని రాధాయే స్వయంగా బయటపెట్టడం.. ఆ తర్వాత ప్రభుత్వం 2+2 సెక్యూరిటీ కల్పించడం.. ఆయన తిరస్కరించడం జరిగిపోయాయి.. మరోవైపు.. రెక్కీ నిర్వహించినవారి కోసం పోలీసుల వేట కొనసాగుతోంది.. కొందరిని అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే.. వంగవీటి రాధాపై రెక్కీ వ్యవహారంలో టీడీపీ సీనియర్ నేత చినరాజప్ప సీరియస్‌గా స్పందించారు.. రాధాను పార్టీలో చేర్చుకోవడం కాదు.. రెక్కీ నిర్వహించిన.. కుట్ర పన్నిన వైసీపీ నేతలపై…
సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి అలవోకగా అబద్ధాలు చెబుతున్నారని టీడీపీ సీనియర్‌నేత దూళిపాళ్ల నరేంద్ర అన్నారు. అర్థసత్యాలు, అసత్యాలతో రాష్ర్టంలోని పాడి రైతులను మోసగిస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా లీటర్ పాలకు ఇస్తానన్న రూ.4ల బోనస్ జగన్ ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. 1950, 60 దశకాల్లో రాష్ట్రంలో ప్రారంభమైన పాడిరైతుల సహాకారసమాఖ్యల మూసివేతకు సీఎం ప్రయత్నిస్తున్నారన్నారు. సీఎం జగన్ అమూల్ కి బ్రాండ్ అంబాసిడరుగా వ్యవహరిస్తున్నారు. ఏపీలోని పాల డెయిరీలను సీఎం జగన్ నిర్వీర్యం చేయాలని…
ఇటీవల వంగవీటి రాధా తనను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారు అంటూ చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో వంగవీటి రాధాకు ప్రభుత్వం భద్రత కల్పించనున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాసారు. వంగవీటి రాధా హత్యకు జరిగిన రెక్కీపై సమగ్ర విచారణ జరుపాలని చంద్రబాబు కోరారు. దోషులపై చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. రాధాకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత…
వంగవీటి రాధా ఎపిసోడ్ ఇప్పుడు ఏపీలో చర్చగా మారింది.. తనను హత్య చేయడానికి రెక్కీ నిర్వహించారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన.. తననేదో చేద్దామని కుట్ర చేశారని.. దేనికీ భయపడనని పేర్కొన్నారు.. తాను ప్రజల మధ్య ఉండే మనిషినని చెప్పిన రాధా.. అన్నింటికీ సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.. దీనిపై పెద్ద చర్చే జరిగింది.. చివరకు ప్రభుత్వం వెంటనే రాధాకు 2+2 గన్మన్ల భద్రత కూడా కల్పించింది. రాధా భద్రతపై సీఎం వైఎస్ జగన్ సంబంధిత అధికారులకు కీలక…
బీజేపీ నిర్వహించే ప్రజాగ్రహ సభ చరిత్రలో బూటకంగా నిలిచిపోతుందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఉన్న బీజేపీకి ఏపీలో ఉన్న బీజేపీకి చాలా తేడా ఉందని, రాష్ట్రంలో ఉన్న బీజేపీ జగన్ కు అనుకూలంగా పనిచేస్తోందని ఆయన ఆరోపించారు.పశ్చిమబెంగాల్ లో చీమ చిటుక్కుమన్నా కేంద్ర హోంమంత్రి వెళతారని, ఏపీలో ఏమి జరిగినా కేంద్రం మాట్లాడటం లేదని ఆయన అన్నారు. కేంద్రం టెలిస్కోప్ లో రాష్ట్ర రాజకీయలను చూస్తుందని కేంద్ర…