ఏపీ సీఎం పుట్టిన రోజే పేదల రక్తాన్ని పీల్చే పథకాన్ని ప్రారంభించారని టీడీపీ రాష్ర్ట అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఓటిఏస్ పథకాన్ని పూర్తిగా రద్దు చేసి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసేవరకు టీడీపీ పోరాడుతుందన్నారు.
ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు కట్టిన ఇళ్లపై దుర్మార్గంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు.టీడీపీ హయాంలో రద్దు చేయలేదుఎందుకనీ బొత్స అంటున్నారని, కానీ మీరు ఇంత దుర్మార్గులని ఊహించలేదని అచ్చెన్నాయుడు అన్నారు. కేవలం డబ్బులు కోసమే వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని తెరపైకి తీసుకొచ్చిందన్నారు. ఎక్కడా లేని విధంగా దేశ చరిత్రలోనే మూడు లక్షల తొంభై వేల కోట్లను అప్పుతీసుకు వచ్చారని మండిపడ్డారు. ఏపీకి ఏ బ్యాంకు అప్పు ఇవ్వడం లేదన్నారు.
Read Also:ఒక్క గజం భూమి కూడా అన్యాక్రాంతం కానివ్వం: మంత్రి కన్నబాబు
ప్రభుత్వాన్ని నడపడానికి డబ్బులు లేక ఓటిఏస్‌తో డబ్బు దోపిడిని మొదలు పెట్టిందన్నారు. మీ మ్యానిఫెస్టోలో ఏముంది ? మ్యానిఫెస్టోలో 5 లక్షల ఇళ్లలో ఒక్క ఇళ్లయినా నిర్మించారా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన పట్టాల భూములు వర్షం పడితే సముద్రంలా తయారయ్యాయన్నారు. వాటిని మేం వద్దంటే అడ్డుకుంటున్నారని మాపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. మీరు కట్టన ఇల్లుకు మీరు ఎలా డబ్బులు వసూలు చేస్తారు. ఎవ్వరూ ఓటిఏస్ కట్టోద్దు…. మేం వస్తున్నాం .. మేం ఉచితంగా ఇస్తాం. బలవంతం కాదంటూనే కలెక్టర్లకు, ఆర్డీఓలకు సచివాలయ సిబ్బంది కి టార్గెట్ పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.